ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఇదేం బుద్ధిరా అయ్యా.. లేడీస్ వాష్‌ రూమ్‌లో ఏం చేశాడంటే..!

ABN, Publish Date - Aug 11 , 2024 | 04:43 PM

రోజు రోజుకు కొందరు మనుషుల బుద్ధి మరింత గలీజ్‌గా తయారవుతోంది. కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేసే ఉద్యోగి చెండాలమైన పని చేశాడు.

Coffee Cafe Washroom

బెంగళూరు, ఆగష్టు 11: రోజు రోజుకు కొందరు మనుషుల బుద్ధి మరింత గలీజ్‌గా తయారవుతోంది. కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరిస్తు్న్నారు. తాజాగా బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేసే ఉద్యోగి చెండాలమైన పని చేశాడు. మహిళల వాష్ రూమ్‌లో సీక్రెట్‌గా ఫోన్ కెమెరా పెట్టాడు. ఈ వ్యవహారం బట్టబయలవడంతో.. అతని ఉద్యోగం పోవడమే కాకుండా.. జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో మహిళల వాష్ రూమ్‌లో కెమెరా పెట్టాడు అక్కడ పని చేస్తున్న ఉద్యోగి. వాష్ రూమ్ చెత్తబుట్టలో తన సెల్‌ఫోన్‌ను ఉంచాడు. ఆ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి కెమెరాను ఆన్ చేసి పెట్టాడు. చెత్త బుట్టలో జాగ్రత్తగా అమర్చాడు. కెమెరాకు ఏమీ అడ్డురాకుండా చిన్న రంధ్ర చేసి, టాయిలెట్ సీట్‌కు ఎదురుగా పెట్టాడు. ఈ కెమెరాను గమనించిన ఓ మహిళ.. వెంటనే అలర్ట్ అయ్యింది. ఆ చెత్త బుట్టలోని ఫోన్‌ను బయటకు తీసింది. దాదాపు 2 గంటలుగా కెమెరా రికార్డ్ అయినట్లు గుర్తించారు. వెంటనే విషయంపై కాఫీ షాప్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో కాఫీ షాప్ యాజమాన్యం సదరు నీచుడిపై చర్యలు తీసుకుంది.


ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఎంతపెద్ద పేరు, ప్రఖ్యాతలు కలిగిన సంస్థలయినా.. మహిళలు అలర్ట్‌గా ఉండాలని ఈ పోస్ట్‌లో సూచించారు. ప్రతి చోటూ ఇలాంటి చిల్లరగాళ్లు ఉంటారని, మన అప్రమత్తత మనల్ని సేవ్ చేస్తుందని క్యాప్షన్ పెట్టారు. దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇదిలాఉంటే.. ఘటనపై సదరు కాఫీ సంస్థ స్పందించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన సంస్థ.. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని వెంటనే ఉద్యోగం నుంచి తీసేసినట్లు తెలిపింది. తమ సంస్థకు చెందిన ఔట్‌లెట్‌లలో ఇలాంటి దుశ్చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసులను కూడా సమాచారం అందించామని, వారు అతన్ని అరెస్ట్ చేశారని కాఫీ విక్రయ సంస్థ తెలిపింది.


Also Read:

హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన!

తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం.. శివకుమార్

మోహన్ బాబు జీవితం నిదర్శనం..!!

For More National News and Telugu News..

Updated Date - Aug 11 , 2024 | 04:43 PM

Advertising
Advertising
<