ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinesh Phogat: కాంగ్రెస్‌లోకి ఫొగట్‌, పునియా

ABN, Publish Date - Sep 07 , 2024 | 05:54 AM

రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా కాంగ్రె్‌సలో చేరారు. వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

  • ఖర్గేతో భేటీ తర్వాత వేణుగోపాల్‌ సమక్షంలో పార్టీలో చేరిన రెజ్లర్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా కాంగ్రె్‌సలో చేరారు. వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట ఇద్దరూ వెళ్లి రాహుల్‌ గాంధీని కూడా కలిశారు. కొద్ది రోజుల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఫొగట్‌, పునియా శుక్రవారం కాంగ్రె్‌సలో చేరడం గమనార్హం. తొలుత వీరిద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ హరియాణా ఇన్‌చార్జి దీపక్‌ బబారియా సమక్షంలో కాంగ్రె స్‌ కండువా కప్పుకొన్నారు.


అనంతరం వి లేకరులతో వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఫొగట్‌, పునియాలు రాహుల్‌ను కలిసినందుకు రైల్వే అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారని చెప్పారు. రాజకీయ నేతలను కలవడం ద్వారా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులో పేర్కొన్నట్లు తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతను కలవడం నేరమా? అని ప్రశ్నించారు. కాగా, శుక్రవారం ఫొగట్‌ రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఫొగట్‌ మాట్లాడుతూ.. రెజ్లింగ్‌ క్రీడాకారిణిగా తనకు అండగా నిలిచిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే తాను ఆడినట్లు భావిస్తున్నానని చెప్పారు.


తాము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన కాంగ్రె్‌సకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రె్‌సతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. కాంగ్రె్‌సలో చేరిన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ హరియాణాలోని జులానా నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఆమె పేరు ఉంది. మరో రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాను అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు.

Updated Date - Sep 07 , 2024 | 05:54 AM

Advertising
Advertising