ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

ABN, Publish Date - Nov 23 , 2024 | 04:06 PM

ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్‌డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో (Uttar Pradesh Bypolls) బీజేపీ, ఆ పార్టీ భాగస్వామి ఆర్ఎల్‌డే విజయపథంలో దూసుకుపోతుండటంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రధాన నరేంద్ర మోదీ విజయవంతమైన నాయకత్వం, నిర్దేశకత్వంపై ప్రజలు అంచచల విశ్వాసం ఉంచారడానికి ఈ విజయమే తార్కాణమని, ఇందుకు రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

Jharkhand Assembly Results: హేమంత్ సోరెన్‌కే మళ్లీ సీఎం పీఠం.. బీజేపీ ఆశలకు 'ఇండియా' కూటమి గండి


ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్‌డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి. కుందర్కి, ఖైర్, ఘజియాబాదాద్, ఫుల్పూర్, కతెహారి, మఝవాన్ సీట్లలో బీజేపీ, మీర్‌పూర్‌లో ఆర్ఎల్‌డీ, కర్హాల్, సిషామౌ నియోజకవర్గాలో సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి.


బటేంగే తో కటేంగే..

ఉప ఎన్నికల ఫలితాలపై వరుస ట్వీట్లలో యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ''యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ-ఎన్‌డీఏ విజయం మోదీ విజయవంతమైన నాయకత్వం, నిర్దేశకత్వంపై ప్రజలు ఉంచిన అంచంచల విశ్వాసానికి తార్కాణం. డబుల్ ఇంజన్ ప్రభత్వంలో భద్రత, సుపరిపాలన, ప్రజాసంక్షేమ పథకాలు, అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేసిన కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది. విజేతలైన అభ్యర్థులందరికీ నా అభినందులు. విభజిస్తే మనం పడిపోతాము... ఐక్యంగా నిలబడతాం ((బటేంగే తో కటేంగే... ఏక్ రహేంగే తో నేక్ రహేంగే)) అని యోగి పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ యోగి ఆదిత్యనాథ్ ఈ నినాదాన్ని 'ట్రంప్ కార్డు'గా ఎంచుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'

Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 04:06 PM