స్థాయికి తగిన ప్రతిఫలం
ABN , Publish Date - Mar 14 , 2025 | 02:57 AM
భర్తృహరి తన ‘నీతిశతకం’లో రచించిన ‘స్వల్ప స్నాయు వసావసేక మలినం...’ అనే శ్లోకాన్ని తెలుగువారికి ఏనుగు లక్ష్మణకవి ఈ పద్యం ద్వారా అందించారు...

సుభాషితం
స్నాయువసావశేష మలినమ్మగు నెమ్ము గ్రహించి జాగిలం
బాయతమోదమందు జన దాకలి దానికి జెంతనున్న గో
మాయువు దాని జూచి పరిమార్పక సింగము దంతి గూల్చు నీ
చాయల నెల్లవారు నిజసత్త్వ సమాన ఫలార్థులే గదా!
భర్తృహరి తన ‘నీతిశతకం’లో రచించిన ‘స్వల్ప స్నాయు వసావసేక మలినం...’ అనే శ్లోకాన్ని తెలుగువారికి ఏనుగు లక్ష్మణకవి ఈ పద్యం ద్వారా అందించారు.
భావం: అసహ్యమైన వాసన వేస్తున్న చిన్న ఎముక దొరికినా, దానిలో మాంసం లేకపోయినా... శునకం ఆ ఎముకను నాకుతూ సంతృప్తి పడుతుంది. కానీ దానివల్ల ఆ శునకం ఆకలి తీరదు. కానీ మృగరాజైన సింహం తన ఎదురుగా నక్కల్లాంటి జీవులు తిరుగుతున్నా వాటిని వదిలిపెట్టి, మదగజాన్ని వెతికి వేటాడుతుంది. జీవులన్నీ తమ శక్తి సామర్థ్యాలకు తగిన ఫలితాన్నే ఆశిస్తాయి. సమర్థత ఉన్నవారు తక్కువ ఫలితం కోసం పాకులాడకుండా తమ స్థాయికి తగిన ప్రతిఫలం కోసం ప్రయత్నిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..