ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : కురుల ఆరోగ్యానికి.. అలొవెరా!

ABN, Publish Date - Jun 30 , 2024 | 11:27 PM

న్యూట్రిన్లు, విటమిన్లు, అమినో ఆమ్లాలుండే అలొవెరా చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

న్యూట్రిన్లు, విటమిన్లు, అమినో ఆమ్లాలుండే అలొవెరా చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇంట్లోని పెరటిలో ఉండాల్సిన మొక్క ఇది. ఇంతకీ అలొవెరాతో హెయిర్‌ ప్యాక్స్‌ చేసుకోవటమెలా?

  • అలొవెరా జెల్‌ను తలకు పట్టించుకుంటే.. జుట్టు రాలటం ఆగిపోతుంది. ముఖ్యంగా తలలో దురదలు తగ్గిపోతాయి.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది. మాడు చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, రెండున్నర స్పూన్ల కొబ్బరినూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే.. హెయిర్‌ డ్యామేజ్‌ కావటం ఆగిపోతుంది.

  • రెండున్నర టేబుల్‌ స్పూన్లు అలొవెరా జెల్‌కు.. రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం వేయాలి. మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా పలుసార్లు చేస్తుంటే.. చుండ్రు పోతుంది. జుట్టు మిలమిలా మెరుస్తుంది.

  • రెండు టేబుల్‌ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. హెయిర్‌ ప్యాక్‌ కోసం బౌల్‌లో మూడు స్పూన్ల అలొవెరా జెల్‌ తీసుకుని.. ఇందులోకి మెంతుల పేస్ట్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది.

  • బౌల్‌లో అరకప్పు అలొవెరా జెల్‌ తీసుకుని.. ఇందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, ఒక కోడిగుడ్డు వేసి స్పూన్‌తో మెత్తటి పేస్ట్‌లో చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Updated Date - Jun 30 , 2024 | 11:38 PM

Advertising
Advertising