ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navya : బొద్దుగుమ్మ

ABN, Publish Date - May 19 , 2024 | 11:57 PM

ఒకే ఒక్క చాన్స్‌ కోసం పరితపించలేదు. ‘వెండితెర’పై వెలిగిపోవాలనీ కలలు కనలేదు. విదేశాల్లో చదివి... ఉద్యోగం కోసం ముంబయి వచ్చి... అనుకోకుండా నటి అయింది పరిణీతి చోప్రా. కెరీర్‌ ఆరంభంలో దూసుకుపోయినా... ఆ తరువాత అపజయాలు ఎదురైనా... ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.

ఒకే ఒక్క చాన్స్‌ కోసం పరితపించలేదు. ‘వెండితెర’పై వెలిగిపోవాలనీ కలలు కనలేదు. విదేశాల్లో చదివి... ఉద్యోగం కోసం ముంబయి వచ్చి... అనుకోకుండా నటి అయింది పరిణీతి చోప్రా. కెరీర్‌ ఆరంభంలో దూసుకుపోయినా... ఆ తరువాత అపజయాలు ఎదురైనా... ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగే మనోధైర్యం ఇచ్చింది... యోగా, సమతుల ఆహారం అంటుంది పరిణీతి.

విదేశీ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు, మార్కెటింగ్‌ విభాగంలో కొలువు... సినిమా రంగం అనేది అసలు పరిణీతి చోప్రా ఆలోచనల్లోనే లేదు. కెరీర్‌లో భాగంగా అందివచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది.

హరియాణా అంబాలాలో పుట్టి పెరిగిన పరిణీతి తండ్రి పవన్‌ చోప్రా వ్యాపారి. తల్లి రీనా గృహిణి. ప్రముఖ నటులు ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మనారా చోప్రా ఆమె కజిన్స్‌. అంబాలా ‘జీసస్‌ అండ్‌ మేరీ కాన్వెంట్‌’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన పరిణీతి చదువులో ముందుండేది.

ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్‌ కావాలని కలలు కన్న ఆమె... 17 ఏళ్ల వయసులో బ్రిటన్‌ వెళ్లింది. అక్కడి ‘మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌’లో బిజినెస్‌, ఫైనాన్స్‌, ఎకనామిక్స్‌లో త్రిపుల్‌ ఆనర్స్‌ డిగ్రీ పొందింది. కొత్తగా వర్సిటీకి వచ్చిన విద్యార్థులకు ఓరియంటేషన్‌ తరగతులు తీసుకొనేది.

చదువుకొంటూనే... ‘మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌’లో కేటరింగ్‌ విభాగం హెడ్‌గా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసింది. పరిణీతి మంచి గాయని కూడా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. సంగీతంలో బీఏ ఆనర్స్‌ పూర్తి చేసింది. చిన్నతనంలో ప్రియాంకా చోప్రాతో కలిసి పలు వేదికలపై నాటకాలు వేసేది. ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.

  • అనుకోని ప్రయాణం...

ఆర్థికమాంద్యం దెబ్బకు 2009లో భారత్‌కు తిరిగి వచ్చిన పరిణీతి... తన నివాసాన్ని ముంబయికి మార్చింది. అక్కడి ‘యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌’ (వైఆర్‌ఎఫ్‌) ప్రొడక్షన్‌ కంపెనీలో పబ్లిక్‌ రిలేషన్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అదే ఆమె కెరీర్‌ను అనూహ్య మలుపు తిప్పింది.

‘‘నేను చదువుకున్నదానికి, నాకున్న సినీ పరిజ్ఞానానికి ఈ ఉద్యోగం సరిగ్గా సరిపోతుందని అనుకున్నా. అయితే 2010లో విడుదలైన ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నాకు బలంగా అనిపించిందేమిటంటే... నటించాలని. ఎప్పుడైతే నటి కావాలన్న ఆకాంక్ష మొదలైందో... ఇక నేను ఆ ఉద్యోగంలో ఉండలేకపోయాను.


వైఆర్‌ఎఫ్‌ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ను కలిసి విషయం చెబితే... తను సరదాగా డమ్మీ ఆడిషన్‌ ఒకటి చేయమన్నారు. ‘జబ్‌ ఉయ్‌ మెట్‌’లో ఓ చిన్న బిట్‌ చేశాను. దాని గురించి మరిచిపోయాను. తరువాత ఆ వీడియో వైఆర్‌ఎఫ్‌ అధినేత ఆదిత్య చోప్రా చూసి నాకు కబురు పంపారు. ఆయనకు అది బాగా నచ్చిందట. అంతే... ఒకేసారి మూడు చిత్రాలకు సైన్‌ చేశాను.

అలా నా సినీ కెరీర్‌ ప్రారంభమవడానికి పరిస్థితులు వాటంతట అవే కలిసివచ్చాయి’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్న పరిణీతి తొలి చిత్రం ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ బహల్‌’. రణ్‌వీర్‌సింగ్‌, అనుష్కా శర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 2011లో విడుదలైంది. అందులో పరిణీతి నటనకు ‘ఫిలిమ్‌ఫేర్‌’తో పాటు పలు అవార్డులు దక్కాయి.

  • పాత్ర కోసం ఎందాకైనా...

అర్జున్‌కపూర్‌ తొలి చిత్రం ‘ఇషక్‌జాదే’తో కమర్షియల్‌ హిట్‌ మాత్రమే కాదు... జాతీయ అవార్డు కూడా అందుకుంది పరిణీతి చోప్రా. కెరీర్‌ ఆరభంలో హిట్స్‌ స్వాగతం పలికినా... ఆ తరువాత వరుస ఫ్లాప్‌లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే ఆమె కుంగిపోలేదు. తనవైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా ప్రతి పాత్రకూ వంద శాతం శ్రమిస్తుంది. సినిమాల్లోకి వచ్చేముందు 86 కిలోల బరువున్న ఈ భామ... 28 కిలోలు తగ్గింది. గత ఏడాది రాజకీయ నాయకుడు రాఘవ్‌ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె... ఈ మధ్య ఓటీటీలో విడుదలైన ‘అమర్‌సింగ్‌ చంకీలా’లో అమర్‌జీత్‌ పాత్ర కోసం పదిహేను కిలోల బరువు పెరిగింది. మరో ప్రాజెక్ట్‌ కోసం తిరిగి బరువు తగ్గే పనిలో నిమగ్నమైంది. తన వెయిట్‌లాస్‌ స్టోరీని ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ వీడియో ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చింది.

  • వర్కవుట్‌ ఇలా...

పరిణీతి చోప్రా నిత్య వ్యాయామాలు కాస్త భిన్నంగా ఉంటాయి. కళరిపయట్ట్టు వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ను తన ఫిట్‌నె్‌సలో చేర్చింది. కళరియపట్టు కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తూనే... డ్యాన్స్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌, ముఖ్యంగా యోగాకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఎక్సర్‌సైజ్‌లు కలగలిపి ఉంటాయి. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వీధుల్లో నడవడం, స్కూబా డైవింగ్‌లు చేయడం... ఏదో రకంగా శరీరానికి తగిన వ్యాయామం అందేలా చూసుకొంటుంది. జీరో సైజుల్లాంటి పేర్లతో బక్కపల్చగా కనిపించడంకంటే... బొద్దుగా అయినా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం అంటుంది. అదే దారిలో నడుస్తోంది.


  • జిమ్‌కు వెళితే కార్డియో కోసం అరగంట ట్రెడ్‌మిల్‌. శారీరక దృఢత్వం కోసం వెయిట్‌లిఫ్టింగ్‌.

  • దీంతోపాటు కళరిపయట్టు సాధన. ‘ఇలాంటి కొత్త కొత్త కళల అభ్యాసం వల్ల శరీరం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. క్రమంతప్పని వ్యాయామంవల్ల రక్తప్రసరణ మెరుగయ్యి, చర్మానికి ప్రాణవాయువును ఇస్తుంది. తద్వారా చర్మం కాంతిమంతంగా తయారవుతుంది’ అనేది పరిణీతి మాట.

  • ఉదయం లేదా సాయంత్రం యోగా తప్పనిసరి. ‘ఇది అద్భుతమైన వ్యాయామం. యోగా సాధనతో శరీరానికి కావల్సిన శక్తి వస్తుంది. నాజూకైన ఆకృతి సొంతమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేసే పనిపై ఏకాగ్రత కుదురుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఒక్క మ్యాట్‌ ఉంటే చాలు... ప్రపంచంలో ఎక్కడైనా... ఏ సమయంలో అయినా చేసుకోదగిన వ్యాయామం యోగా’ అంటుంది పరిణీతి.

  • కొన్ని రోజులు జిమ్‌కు విరామం ఇచ్చి పార్కుల వంటి అవుట్‌డోర్స్‌లో వాకింగ్‌ చేయడంవల్ల మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని, శరీరానికి కూడా ఉపశమనం లభిస్తుందని అంటుంది పరిణీతి. రోజు జిమ్‌కు వెళ్లి, శ్రమించాలన్న నియమం ఏదీ లేదని అంటుంది. అలా విరామం ఇచ్చినప్పుడు ఆమె ఎక్కువగా బ్రిస్క్‌ వాక్‌ చేస్తుంది.

  • తరచూ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వర్కవుట్‌ చేస్తే బోర్‌ కొట్టకుండా ఉంటుందని, ఇష్టమైన క్రీడను ఫిట్‌నెస్‌ మెనూలో చేర్చుకొంటే ఉత్సాహం రెట్టింపు అవుతుందనేది ఈ స్టార్‌ ఆచరించి చెబుతున్న ఫిట్‌నెస్‌ పాఠం.

‘అమర్‌సింగ్‌ చంకీలా’ కోసం పదిహేను కిలోలు పెరిగే క్రమంలో నచ్చిన వెరైటీలన్నీ తినేసింది పరిణీతి. ఇప్పుడు బరువు తగ్గే క్రమంలో ఆహరం విషయంలో ఎన్నో నియమాలు పెట్టుకుంది. మొదటగా తనకు ఇష్టమైన పిజ్జాతో పాటు ఇతర జంక్‌ఫుడ్స్‌ను పూర్తిగా మానేసింది. పోషకాలు పుష్కలంగా ఉన్న, ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే మెనూలో చేర్చింది.

  • ఉదయం బ్రేక్‌ఫా్‌స్టలో బటర్‌తో బ్రౌన్‌ బ్రెడ్‌, రెండు ఎగ్‌వైట్స్‌, గ్లాసుడు పాలు లేదా పండ్ల రసం.

  • మధ్యాహ్నం లంచ్‌కు పప్పుతో బ్రౌన్‌ రైస్‌, రోటీ, ఆకుకూరల వంటకం, సలాడ్‌.

  • రాత్రి రోటీ, పప్పు లేదా పప్పు దినుసులతో చేసిన వంటకం. నిద్రపోవడానికి రెండు గంటల ముందే డిన్నర్‌ ముగుస్తుంది.

Updated Date - May 20 , 2024 | 12:39 AM

Advertising
Advertising