ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Tips : ‘ హెయిర్‌ సైక్లింగ్‌ ’ తెలుసా?

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:54 AM

నిగనిగలాడే జట్టు కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే కొందరు ఒకే తరహా ఉత్పత్తులను జుట్టు కోసం వాడుతూ ఉంటారు. ఇలా ఉపయోగించటం సరికాదంటున్నారు నిపుణులు. వారు ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతే హెయిర్‌ సైక్లింగ్‌..

నిగనిగలాడే జట్టు కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే కొందరు ఒకే తరహా ఉత్పత్తులను జుట్టు కోసం వాడుతూ ఉంటారు. ఇలా ఉపయోగించటం సరికాదంటున్నారు నిపుణులు. వారు ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతే హెయిర్‌ సైక్లింగ్‌..

  • అంటే ఏమిటి?

అందరి జుట్టు అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండదు. వయస్సు, మనం తినే ఆహారం, మన చుట్టూ ఉన్న వాతావరణం- వీటన్నింటిపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల మన జుట్టుకు అవసరమైన వాటిని- అవసరమైన సమయంలో అందించటాన్నే హెయిర్‌ సైక్లింగ్‌ అంటారు.

ఉదాహరణకు బయట తిరగటం వల్ల కొందరి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే- పౌష్టికాహారం తీసుకోవాలి. తగిన షాంపులు వాడాలి. ఆ సమయంలో కూడా మనకు అలవాటు అయిన ఆహారమే తింటే- పరిస్థితిలో మార్పు రాదు. ఇదే విధంగా కొందరికి జుట్టు పొడిగా ఉంటుంది.

మరి కొందరికి నూనె రాసినట్లు ఉంటుంది. వయస్సు మీద పడినప్పుడు- పొడి జుట్టు నూనె రాసినట్లు మారిపోవచ్చు. నూనె రాసినట్లు ఉండే జుట్టు పొడిగా అవ్వచ్చు. ఇలాంటి సమయంలో సౌందర్య నిపుణులను అడిగి తగిన ఉత్పత్తులను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.


  • ఎలా మొదలుపెట్టాలి?

1) ముందు- మన జుట్టు పరిస్థితి ఏమిటో అంచనా వేసుకోవాలి. జుట్టు పొడిగా ఉందా? రాలిపోతోందా? చివర్లు చీలిపోతున్నాయా? చుండ్రు పడుతోందా? తలపై నల్లటి మచ్చలు వస్తున్నాయా? మొదలైన విషయాలను జాగ్రత్తగా గమనించాలి.

2) మన అంచనాలకు తగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఉదాహరణకు జుట్టు పొడిగా ఉంటే- తేమను అందించే హైడ్రేటింగ్‌ షాంపును వాడాలి. నూనె రాసినట్లు ఉంటే క్లారిఫైయింగ్‌ షాంపును వాడాలి. వీటితో పాటుగా మనకు ముందు నుంచి అలవాటు ఉన్న ఉత్పత్తులను కూడా వెంటనే మానకూడదు. వాటిని కూడా ఉపయోగిస్తూ ఉండాలి. మనకు అనువైన ఒక రొటీన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

3) మన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తున్నాయో- ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. ఒక వేళ ఎక్కడైనా తేడా వస్తే- వెంటనే ఉత్పత్తులను మార్చుకోవాలి.

Updated Date - Aug 24 , 2024 | 05:02 AM

Advertising
Advertising
<