Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!
ABN, Publish Date - Jul 09 , 2024 | 02:00 PM
తేలిగ్గా జీర్ణం కాకలిగిన పదార్థాలతో ఏ వంటకం చేసినా పిల్లలు, పెద్దలు తినేందుకు ఈజీగా ఉంటుంది. పెద్దగా శ్రమలేకుండా వర్షాకాలం సాయంత్రాలు తినేందుకు స్నాక్స్ ఫ్లాన్ చేస్తుంటే కనుక క్రిస్పీ స్నాక్స్ కొవ్వులు, తక్కువ కేలరీలు ఉండేవి టీ టైమ్ కి సరిపోతాయి.
వర్షాకాలం వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. రుచికరమైన స్నాక్స్ కోసం రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. కాస్త కారం కారంగా, ఘాటుగా, మసాలాలతో ఫ్రై చేసిన పదార్థాలను నోటికి రుచిగా తింటూ ఉంటాం. అయితే రుచితో పాటు కాస్త ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ స్కాక్స్ చేసుకుంటే అటు ఆరోగ్యం, ఇటు మంచి రుచితో కడుపు నిండిపోయే స్నాక్స్ కూడా రెఢీ అవుతాయి. దీనికోసం మనం ఎంచుకునే స్నాక్స్ కాస్త ప్రోటీన్స్, విటమిన్స్ కలగలిసిన పదార్థాలైతే బెటర్..
ఇందుకోసం..
తేలిగ్గా జీర్ణం కాకలిగిన పదార్థాలతో ఏ వంటకం చేసినా పిల్లలు, పెద్దలు తినేందుకు ఈజీగా ఉంటుంది. పెద్దగా శ్రమలేకుండా వర్షాకాలం సాయంత్రాలు తినేందుకు స్నాక్స్ ఫ్లాన్ చేస్తుంటే కనుక క్రిస్పీ స్నాక్స్ కొవ్వులు, తక్కువ కేలరీలు ఉండేవి టీ టైమ్ కి సరిపోతాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడా.
మూంగ్ దాల్ చిల్లా పిజ్జా..
పిజ్జా అనగానే ఇదేదో క్యాలరీలను పెంచేస్తుందనే భయం అక్కర్లేదు. చిల్లా పై మూంగ్ దాల్, కొద్దిగా కెచప్ వేసి, చీజ్, కాసిని కూరగాయలు, ఉప్పు, మిరియాలతో ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ చల్లి తీసుకుంటే సిరపోతుంది.
Vitamin B6 : మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే..!
ఉడికించిన మొక్క జొన్న..
మామూలుగా వానాకాలం వేడి వేడిగా తినేందుకు ఇష్టపడే స్నాక్స్ లో ముందుగా చెప్పుకునేది మొక్కజొన్నే, కార్న్ తీసుకోవడం వల్ల రుచితో పాటు తక్కువ కేలరీలు అందుతాయి. ఇవి ఉడికించి, ఉప్పు, కాస్త మసాలా, నిమ్మకాయ, మరీ ఇష్టమైతే మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు.
సమోసా విత్ పుదీనా చట్నీ..
సమోసా కూడా వర్షాకాలం రాగానే తెగ తినాలనిపించే వంటకం. కేలరీల గురించి బాగా ఆలోచించేట్టయితే తాజా కూరగాయలతో కలిపి సమోసా చేసేత పుదీనా చట్నీ మంచి కాంబినేషన్.
Tooth Brushes : మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!
ఓట్స్ వెజిటబుల్ కట్లెట్స్..
బంగాళా దుంపలు, క్యారెట్లు, బీన్స్, ఆకు కూర ఇవన్నీ సన్నగా తరిగి కూరగాయలతో ఓట్స్ కలిపి తయారు చేసే ఈ కట్లెట్ క్రిస్పీగా మంచి రుచిని ఇస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు విషయానికి వస్తే తక్కువగా ఉంటాయి.
పన్నీర్..
పెరుగు, మసాలా, పనీర్ తో మెరినేట్ చేసిన ఈ ముక్కలను గ్రిల్ చేసి వేయించిన ఈ ముక్కలను సాయంత్రాలు తీసుకుంటే సూపర్ టేస్ట్. గ్రిల్లింగ్ కారణంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. పుదీనా చట్నీ మంచి కాంబినేషన్.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 09 , 2024 | 02:00 PM