ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హెల్త్ వెల్త్‌ : నాడీ వ్యవస్థ నాజూగ్గా

ABN, Publish Date - May 21 , 2024 | 12:50 AM

నాడీ వ్యవస్థ కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన కొవ్వులు ఆహారంలో చేర్చుకోవాలి. ఇందుకోసం...

నాడీ వ్యవస్థ కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన కొవ్వులు ఆహారంలో చేర్చుకోవాలి. ఇందుకోసం....

అవిసె నూనె: ఈ నూనెను కూరగాయల సూప్‌ మీద పోసుకుని తీసుకోవచ్చు. అయితే ఈ నూనెను నేరుగా వంటకు ఉపయోగించకూడదు.

సబ్జా: వీటిని 10 నుంచి 20 నిమిషాలపాటు నీళ్లలో నానబెట్టి తాగాలి. లేదంటే రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగవచ్చు. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జీర్ణవ్యవస్థతో పాటు నాడీవ్యవస్థనూ ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవకాడొ: మాంసకృత్తులు కలిగిన ఈ పండును ఏ సమయంలోనైనా తినవచ్చు.

నాణ్యమైన నూనెలు: ఆలివ్‌, అవకాడొ, కొబ్బరి, నువ్వులు, పొద్దుతిరుగుడు నూనెలు వాడుకోవచ్చు.

నెయ్యి: ఆయుర్వేదంలో నెయ్యి స్వర్ణంతో సమానం. వెన్న, నెయ్యి జీర్ణశక్తిని పెంచి, శరీర కణజాలాలకు శక్తినిస్తుంది.


మర్దన మంచిది

స్వీయ మర్దనతో సాంత్వన పొందవచ్చు. రోజూ లేదా వారంలో ఒకసారి ఇందుకోసం తీరిక సమయం కేటాయించుకోవాలి. శరీరమంతా నూనె పట్టించి సున్నితంగా మర్దన చేసుకోవాలి. పాదాలతో మొదలుపెట్టి నాడులతో సంబంధం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ మర్దన చేసుకోవాలి. పాదాలతో మొదలుపెట్టి కాలి గిలకలు, పిక్కలు, మోకాళ్లు, తొడలు, నడుము, ఉదరం, ఛాతీ, భుజాలు, చేతులు, మెడ, ముఖం... ఈ విధంగా కింద నుంచి పైకి మర్దన సాగాలి. మర్దన చేసేటప్పుడు శరీరంలోని ప్రతి అంగుళాన్నీ స్పృశించాలి. శరీరాన్ని రుద్ది, తాకి, మర్దించేటప్పుడు నాడులన్నీ ఉత్తేజితమవుతున్న అనుభూతికి లోనవ్వాలి. మర్దనతో శరీరానికి పట్టించిన నూనె చర్మంలోకి ఇంకి, నాడుల చివర్లకు చేరుతుంది. దాంతో వ్యాధుల నుంచి రక్షణ అందడంతో పాటు శరీరావయవాలకు శక్తి అందుతుంది.

Updated Date - May 21 , 2024 | 12:50 AM

Advertising
Advertising