ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seasonal Ingredients : ఇతర రాష్ట్ర రుచులు మీ కోసం...

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:47 AM

శీతాకాలంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని రుచికరమైన పదార్థాలను ఎలా చేయాలో తెలుసుకుందాం.

వంటిల్లు

శీతాకాలంలో వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన వంటలు వండుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని రుచికరమైన పదార్థాలను ఎలా చేయాలో తెలుసుకుందాం.

  • బెంగాలీ మాల్పువా

బెంగాల్‌లో రసగుల్లా, గులాబ్‌జామ్‌లతో పాటుగా మాల్పువాను కూడా ఎక్కువగా తింటారు. ముఖ్యంగా చలికాలంలో ఈ మాల్పువాకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ మాల్పువాను ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు: మైదా- నాలుగు కప్పులు, రవ్వ- ఒక కప్పు, పంచదార- రెండున్నర కప్పులు, ఏలకులు- ఆరు, బేకింగ్‌ పౌడర్‌- ఒక స్పూను, చిక్కగా మరగపెట్టిన పాలు- రెండు కప్పులు, నూనె- రెండు కప్పులు, నీళ్లు- తగినన్ని

తయారీవిధానం: ఒక గిన్నెలో మైదా, రవ్వ, ఒక కప్పు పంచదార, ఏలకుల పొడి, బేకింగ్‌ పౌడర్‌లు వేసి కలపాలి. దానిలో పాలు పోసి ముద్దగా కలపాలి. దీనిపై ఒక మూత పెట్టి అరగంట సేపు ముద్దను నాననివ్వాలి.

  1. ఒక మూకుడులో నూనెను వేడి చేయాలి. మాల్పువా ముద్దను పలుచగా గారెల మాదిరిగా అరచేతిలో ఒత్తాలి. వాటిని ఈ నూనెలో వేయించాలి.

  2. మాల్పువాలను వేయిస్తున్న సమయంలోనే ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు పంచదార వేసి పాకం పట్టాలి. బాగా వేగిన మాల్పువాలను ఈ పంచదార పాకంలో వేసి.. కొద్దిగా పాకం పీల్చిన తర్వాత బయటకు తీయాలి.

  • జాగ్రత్తలు

  1. పంచదార పాకం పలుచగా ఉండాలి. గట్టిపడితే మాల్పువా బావుండదు.

  2. కొందరు నూనె బదులు నెయ్యి కూడా వాడతారు. జాగ్రత్తలు


  • మిసాల్‌ పావ్‌

మహారాష్ట్రలో చాలా సుప్రసిద్ధమైన వంటకమిది. దీనిలో పోషక విలువలు ఎక్కువ ఉండటం వల్ల కార్మికులు, కర్షకులు ఎక్కువగా తింటూ ఉంటారు. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు: మిసాల్‌ (పావ్‌ బ్రెడ్‌)- నాలుగు, కొబ్బరి తురుము: ఒక కప్పు, ధనియాలు- ఒక చెంచా, జీలకర్ర-ఒక చెంచా, మిరియాలు- అర చెంచా, లవంగాలు-ఆరు, ఏలకులు- నాలుగు, నువ్వులు- రెండు చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక చెంచా, బంగాళదుంప ముక్కలు- రెండు కప్పులు, మొలకలు- రెండు కప్పులు, కారం- రెండు చెంచాలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు- రెండు చెంచాలు, పసుపు- ఒక చెంచా, మిక్సర్‌- నాలుగు చెంచాలు, నూనె- ఒక కప్పు, నీళ్లు- తగినన్ని, ఉప్పు- తగినంత, నిమ్మరసం- నాలుగు చెంచాలు.

  • తయారీ విధానం

  1. ఒక మూకుడులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఏలకులు, నువ్వులు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత వీటిని పొడిలా చేసుకోవాలి.

  2. అదే మూకుడులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. దానిలో ఉల్లిపాయముక్కలు, కొబ్బరితురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. దీనిని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి.

  3. ఒక గిన్నెలో మొలకలు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి- కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉంచాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని స్పూనుతో మెత్తగా ముద్దలా చేయాలి.

  4. మూకుడులో నూనె పోసి వేడి చేయాలి. దానిలో ఉల్లిపాయ ముక్కల పేస్ట్‌ను, మొలకల పేస్ట్‌ను, బంగాళ దుంప ముక్కలను కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి. ఆ తర్వాత దానిలో ముందుగా తయారుచేసుకున్న పొడిని కలపాలి.

  5. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత దానిలో పచ్చి మిరపకాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి ఒక పది నిమిషాలు ఉడికించాలి.

  6. దీనిని కిందకు దింపి నిమ్మరసం కలపాలి. మిసాల్‌ బ్రెడ్‌, మిక్సర్‌తో పాటుగా తినటానికి అందించాలి.

  • జాగ్రత్తలు

  1. కొందరు మిసాల్‌ బ్రెడ్‌ను వెన్న లేదా నెయ్యితో కాల్చి తింటారు. అలా తింటే రుచి పెరుగుతుంది.

  2. మొలకలు, బంగాళదుంపలు బాగా మెత్తగా అయ్యేలా ఉడికిస్తే మంచి రుచి వస్తుంది.

  3. పావ్‌ బ్రెడ్‌ అన్ని కిరాణా దుకాణాలలోను లభిస్తుంది.


  • అలూ భునా

ఉత్తర భారత దేశంలో చలికాలంలో దీన్ని ఎక్కువగా తింటారు. దీనిలో అన్ని రకాల కూరగాయలు వేయటం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బంగాళ దుంప ముక్కలు: నాలుగు కప్పులు, టమోటా ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- రెండు కప్పులు, క్యాప్సికం ముక్కలు- ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక చెంచా, పచ్చి మిరపకాయ ముక్కలు- రెండు స్పూన్లు, కారం- రెండు చెంచాలు, ధనియాల పొడి- ఒక చెంచా, గరం మసాలా- రెండు చెంచాలు, జీలకర్ర - ఒక చెంచా, పెరుగు- ఒక కప్పు, క్రీమ్‌- పావు కప్పు, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, నూనె- పావుకప్పు ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని,

తయారీ విధానం:

ఒక మూకుడులో నూనె వేడి చేయాలి. దానిలో జీలకర్రను వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చి మిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు, కాప్సికం ముక్కలు వేసి వేయించాలి.

  1. ఈ మిశ్రమంలో పెరుగు వేయాలి. దానిలో గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి కలపాలి. చివరగా బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి.

  2. దాన్ని దింపిన తర్వాత క్రీమ్‌, తరిగిన కొత్తిమీర వేయాలి.

జాగ్రత్తలు

  1. కొందరు కొద్దిగా ఉల్లిపాయలను, జీలకర్రను నూనెలో వేయించి కూరపైన పోపులా వేస్తారు. దీని వల్ల రుచి పెరుగుతుంది.

  2. బంగాళదుంప ముక్కలు ముద్దగా కాకుండా విడివిడిగా ఉంటే తినేటప్పుడు బావుంటుంది.

Updated Date - Dec 28 , 2024 | 04:48 AM