ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : వంటనూనెను తిరిగి వాడచ్చా?

ABN, Publish Date - Jul 13 , 2024 | 12:35 AM

వంటనూనె లేని వంటిల్లు ఉండదు. కానీ వంటనూనెను ఎలా వాడుకోవాలో ఎవరికీ తెలియదు. ఒక సారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడచ్చా?

వంటనూనె లేని వంటిల్లు ఉండదు. కానీ వంటనూనెను ఎలా వాడుకోవాలో ఎవరికీ తెలియదు. ఒక సారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడచ్చా? దానిని ఎలా భద్రపరచుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

ఎలాంటి నూనెలు వాడుతున్నాం? ఎంత వేడిలో నూనెను కాచాం? నూనెను ఎలా భద్రపరిచాం? అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని నూనెలకు ఎక్కువ స్మోక్‌ పాయింట్‌ (ఎక్కువ వేడిని తట్టుకొని నిలబడే శక్తి) ఉంటుంది. ఉదాహరణకు కనోలా, వేరుశనగనూనె, సన్‌ఫ్లవర్‌ వంటి నూనెలను ఎక్కువ ఉష్ణోగ్రతల వరకు వేడి చేయవచ్చు. ఆలీవ్‌ ఆయిల్‌ వంటి నూనెలు వేడిని తట్టుకొని నిలబడలేవు. వీటిని ఎక్కువగా వేడి చేస్తే చెడు వాసన వస్తుంది.

అదే విధంగా కొన్ని నూనెలను పదే పదే వేడి చేస్తే- వాటి కణ నిర్మాణంలో మార్పు వచ్చి వాటి ద్వారా ఆరోగ్యానికి చెడు చేసే రసాయనాలు విడుదలవుతాయి. ఇలాంటి వాటిని పదే పదే వాడకూడదు. ఒక సారి వాడిన తర్వాత- నూనెలో పేరుకుపోయిన చిన్న చిన్న కణాలను తొలగించి ఒక గాజు లేదా స్టీలు డబ్బాలో నిల్వ చేసుకుంటే మంచిది. ఇలా నిల్వ చేసుకున్న నూనెను మళ్లీ వాడినప్పుడు అది నల్లగా అయిపోతే వాడకుండా బయట పారబోయటం మంచిది.

Updated Date - Jul 13 , 2024 | 12:35 AM

Advertising
Advertising
<