ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya Kitchen : దక్కనీ రుచులు

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:18 AM

రొటీన్‌కు కాస్త భిన్నంగా... ఇంట్లోనే వండుకోగలిగిన దక్కనీ వంటకాలున్నాయి. అవే పనీర్‌ చట్‌పట్‌, ముర్గ్‌ మజెదార్‌, ఘోష్‌ కాలీమిర్చీ. ఈ వీకెండ్‌లో వీటిని ప్రయత్నించి చూడండి.

వంటిల్లు

రొటీన్‌కు కాస్త భిన్నంగా... ఇంట్లోనే వండుకోగలిగిన దక్కనీ వంటకాలున్నాయి. అవే పనీర్‌ చట్‌పట్‌, ముర్గ్‌ మజెదార్‌, ఘోష్‌ కాలీమిర్చీ. ఈ వీకెండ్‌లో వీటిని ప్రయత్నించి చూడండి.

  • ఘోష్‌ కాలీమిర్చీ

కావాల్సిన పదార్థాలు: మటన్‌- అర కేజీ, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడ, పసుపు- అర టీస్పూన్‌, షాజీరా- టీస్పూన్‌, నల్లమిరియాల పొడి- 2 టీస్పూన్లు, దాల్చిన చెక్క- 1, ధనియాల పొడి- టీస్పూన్‌, పెరుగు- 200 గ్రాములు, కొత్తిమీర- 1 టేబుల్‌ స్పూన్‌, పుదీనా- టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి-2 (సన్నగా తరగాలి), ఉల్లిపాయలు- 2 (సన్నగా తరగాలి), నూనె- 4 టేబుల్‌ స్పూన్లు, నిమ్మకాయ రసం- అర టీస్పూన్‌

తయారీ విధానం: శుభ్రం చేసిన మటన్‌ ముక్కలను బౌల్‌లో వేయాలి. ఇందులోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఆ తర్వాత షాజీరా, దాల్చిన చెక్క, నల్లమిరియాల పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఇందులో పెరుగు పోసి బాగా కలిపితే మటన్‌ ముక్కలకు పడుతుంది. ఇందులోకి కొత్తిమీర, పుదీనాతో పాటు పచ్చిమిర్చి వేసి కలపాలి.

కుక్కర్‌లో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చాక మటన్‌ మిశ్రమాన్ని వేయాలి. పొంగులా వచ్చేముందు గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇలా ఐదు నిముషాలు కుక్‌ చేశాక కుక్కర్‌ మీద మూత ఉంచి ఐదారు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. మటన్‌ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. ఘోస్ట్‌ కాలీ మిర్చీ కర్రీ రెడీ.


  • పనీర్‌ చట్‌పట్‌

కావాల్సిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌- 250 గ్రాములు, తరిగిన అల్లం- టీస్పూన్‌, తరిగిన వెల్లుల్లి- టీస్పూన్‌, నెయ్యి- రెండు టీస్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి- 1 టీస్పూన్‌, కారం- టీస్పూన్‌, ఉల్లిపాయ- 1 (సన్నగా తరగాలి), పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, చిల్లీ సాస్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, టమోటా సాస్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మకాయ-1, తరిగిన కొత్తిమీర- టీస్పూన్‌, చాట్‌ మసాలా- టీస్పూన్‌

తయారీ విధానం: పనీర్‌ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్‌ వేడయ్యాక నెయ్యి వేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. సన్నగా తరిగిన అల్లం వేసి కలపాలి. ఈ రెంటినీ వేయించాక.. పచ్చిమిర్చి ముక్కలు వేసిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి లోఫ్లేమ్‌లో వేయించాలి.

బంగారు రంగులోకి ఉల్లిపాయ ముక్కలు మారిన తర్వాత పసుపు, కారంతో పాటు సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. చిల్లీ సాస్‌తో పాటు టమోటా సాస్‌ వేసి రెండు నిముషాల పాటు కలపాలి.

కొన్ని నీళ్లు వేయాలి. పనీర్‌ ముక్కలను వేసి ముక్కలు విరగకుండా కలపాలి. మూడు నిముషాల తర్వాత కాస్త కొత్తిమీర వేసి కలపాలి. కొద్దిగా చాట్‌ మసాలా వేసి చివరగా నిమ్మకాయ రసం వేసి కలపాలి. ఈ పనీర్‌ చట్‌పట్‌ను చపాతీతో కలిపి తినొచ్చు.


  • ముర్గ్‌ మజెదార్‌

కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌- 600 గ్రాములు, ఉల్లిపాయలు- 3 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి ముక్కలు- అర టీస్పూన్‌, జీడిపప్పు పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, టమోటా పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, కారం పొడి- టేబుల్‌ స్పూన్‌, కసూరీ మేతీ- కొద్దిగా, గరం మసాలా- టీస్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత, నూనె- టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర- 2 టేబుల్‌ స్పూన్లు, వెన్న- టీస్పూన్‌, క్రీమ్‌- టీస్పూన్‌, పసుపు- చిటికెడు, ధనియాల పొడి- టేబుల్‌ స్పూన్‌, తరిగిన వెల్లుల్లి- టీస్పూన్‌

తయారీ విధానం: ముందుగా బోన్‌లెస్‌ చికెన్‌ను శుభ్రం చేసి క్యూబ్స్‌లా కట్‌ చేసుకోవాలి. ప్యాన్‌లో వెన్న, నూనె వేసి కలపాలి. ఇందులో తరిగిన వెల్లుల్లి ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌ వేసి కలపాలి.

ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, చికెన్‌ ముక్కలు వేసి కలపాలి. మూడు నిముషాల పాటు కుక్‌ అయ్యాక.. ఇందులోకి జీడిపప్పు పేస్ట్‌, టమోటా పేస్ట్‌ వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు నిముషాలు కలుపుతూ ఉండాలి.

వెంటనే ధనియాల పొడి, కారంపొడి, కొద్దిగా పసుపు, కసూరీ మేతీ పౌడర్‌ వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసి మళ్లీ కలపాలి. చివరగా క్రీమ్‌, వెన్న వేసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసి కలపాలి. చికెన్‌ ముక్కలు ఉడికేంత వరకూ లోఫ్లేమ్‌లో కుక్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. అన్నం లేదా చపాతీలోకి రుచిగా ఉంటుంది.

Updated Date - Aug 24 , 2024 | 05:18 AM

Advertising
Advertising
<