ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya's Kitchen : మేడారం కోడి పులావ్‌

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:26 AM

బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. చికెన్‌లో ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నూనె కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

వంటిల్లు

కావలసిన పదార్థాలు

చికెన్‌: అరకిలో

నూనె: సరిపడా

ఉల్లిపాయలు: 2

కరివేపాకు: 2 రెమ్మలు

పచ్చిమిరపకాయలు: 5

బియ్యం: అరకిలో

చెక్క, లవంగ, యాలకులు: తగినన్ని

కొత్తిమీర, పుదీనా: చెరొక కట్ట

ధనియాల పొడి: 2 టీస్పూన్లు

అల్లంవెల్లుల్లి పేస్ట్‌: తగినంత

ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. చికెన్‌లో ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నూనె కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నెలో నూనె కాచి మసాలా దినుసులు, ధనియాల పొడి, తరిగిన ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ మిశ్రమం వేసి కొత్తిమీర, పుదీనా వేసి 15 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల్లో మేడారం కోడి పులావ్‌ సిద్ధమైపోతుంది.

షెఫ్‌ యాదగిరి

వివాహ భోజనంబు బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

Updated Date - Aug 10 , 2024 | 03:26 AM

Advertising
Advertising
<