Navya Kitchen : ఆహా.. ఏమి రుచి!
ABN, Publish Date - Jul 06 , 2024 | 05:46 AM
చికెన్- ముప్పావు కేజీ, పచ్చిమిర్చి- 6, ఉల్లిపాయ- 1 (పొడవుగా కట్ చేసుకోవాలి), బాస్మతి బియ్యం- 2 కప్పులు, నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు, నూనె- 2 టేబుల్ స్పూన్లు
రాజుగారి కోడిపులావ్
కావాల్సిన పదార్థాలు
చికెన్- ముప్పావు కేజీ, పచ్చిమిర్చి- 6, ఉల్లిపాయ- 1 (పొడవుగా కట్ చేసుకోవాలి), బాస్మతి బియ్యం- 2 కప్పులు, నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు, నూనె- 2 టేబుల్ స్పూన్లు, యాలకులు-4, లవంగాలు-4, దాల్చిన చెక్క- రెండు చిన్న ముక్కలు, బిర్యానీ ఆకు-1, జీడిపప్పులు- 12, ఉల్లిపాయ ముక్కలు- 1 కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు, పసుపు- చిటికెడు, కారం పొడి- టేబుల్ స్పూన్, గరం మసాలా- అర టీస్పూన్, ఉప్పు- తగినంత, పెరుగు- మూడు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర- టేబుల్ స్పూన్, పుదీనా- పావు కప్పు
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. వేయించిన చల్లార్చిన ఉల్లిపాయ మిశ్రమంతో పాటు పచ్చిమిర్చిని జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మెత్తటి పేస్ట్‌ను పక్కన ఉంచుకోవాలి.
ఇపుడు బౌల్‌లో బియ్యం వేసి నీళ్లు పోయాలి. ఇరవై నిముషాలు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో నెయ్యి వేసి, నూనె వేసి గరిటెతో కలపాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కలిపాక జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి.
ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తర్వాత ముందు మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారంపొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిముషాలయ్యాక చికెన్ వేసి కలపాలి. నాలుగు నిముషాల తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి ఆరు నిముషాల పాటు కుక్ చేయాలి. ఆ తర్వాత నాలుగు గ్లాసుల వేడి నీళ్లు పోయాలి. కుక్ చేస్తే పొంగు వస్తుంది. చికెన్ ఉడికిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేయాలి. మంటను తగ్గించి కుక్కర్ మూత ఉంచి ఒక్క విజిల్ వచ్చేంత వరకూ కుక్ చేయాలి. రాజుగారి కోడి పులావ్ రెడీ. వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వడ్డించుకోవాలి.
Updated Date - Jul 06 , 2024 | 05:46 AM