ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : నారింజ పానకం

ABN, Publish Date - Jul 13 , 2024 | 12:57 AM

శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో ‘వాణిజ్యము పెంచి యేలగానగున్‌’ అన్నాడు. ఆనాటి రాజులు ఆ విధానాన్నే పాటించారు. పోర్చుగీసులతో వాణిజ్యంవల్ల మిరప, బొప్పాయి,

సుపక్వా నారంగ ఫలం సుపీడితం సంయోజితం శర్కరయాతిశుభ్రయా

సహార్ద్రకం చెందూకర్ణేన వాసితం మహీతలె కేన న సంస్తృతం క్షణమ్‌!

శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో ‘వాణిజ్యము పెంచి యేలగానగున్‌’ అన్నాడు. ఆనాటి రాజులు ఆ విధానాన్నే పాటించారు. పోర్చుగీసులతో వాణిజ్యంవల్ల మిరప, బొప్పాయి, జామ, సపోటా, కమలా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బంగాళదుంపలతో పాటు పొగాకు మనకు పరిచయం అయ్యాయి. 1606లో డచ్‌ వాళ్లు బతావియా నుంచి తెచ్చి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పండ్ల తోటలు వేయించారు. వాటి కాయల్ని ‘బతావియా నారింజ’ అని పిలిచారు. జన వ్యవహారంలో అవే ‘బత్తాయి పండ్లు’ అయ్యాయి. ఆఖరికి బాతులు, సీమకుక్క పిల్లలు కూడా విదేశీయుల నుంచే మనకు చేరాయి. కాఫీ కూడా డచ్చి వాళ్లవలనే మనకు తెలిసింది. మిరప, బొప్పాయి, బత్తాయి, పొగాకు, సపోటా, బాదం లాంటి కొత్త పదాలు తెలుగులో ఏర్పడ్డాయి.

అంతకు ముందు మనకు తెలిసింది నారింజ (నారంగి) మాత్రమే. నారంగిలోంచి ‘నాఖ’ శబ్దం లోపించి ‘ఆరెంజ్‌’ అనే కొత్త పదం ఆంగ్ల భాషలో చేరింది. పంపరపనస కూడా మన నారింజలాగానే ఉండే పుల్లని పండు (మాండారిన్‌). నారింజ పంపరపనస ఫలాల సంకరంగా కమలాపండు ఏర్పడింది. ఆయుర్వేద గ్రంథాలు నారంగ ఫలం గురించి మాత్రమే పేర్కొన్నాయి. నారంగ లేదా నారింజ గుణాలే ఇంచుమించుగా బత్తాయి, కమలాలకూ ఉన్నాయి. ఈ మూడింటిలోనూ అత్యంత శక్తిమంతమైనది నారింజే. కమలా గానీ, బత్తాయి గానీ పైమెరుగులతో మెరుస్తూ, గుజ్జు ఎక్కువగా, తోలు వదులుగా ఉన్నవి జన్యుపరమైన రూపాంతరాలు చేసినవి కావచ్చు. అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయన్నది తెలియదు. చిన్నవిగా ఉన్న పండ్లనే ఎంచుకోవాలి.


ఈ పండ్ల నుంచి రసం తీసి లోపలి గుజ్జుని పారేయటం మంచిది కాదు. తోలు వలిచాక బత్తాయి, కమలాలపై ఉండే తెల్లని పీచును కూడా అలా పారేయకండి. ఈ పీచులో పెప్టిన్‌, ఏడు శాతం ప్రొటీన్‌, తగినంత సి, బి విటమిన్లతో సమానమైన ‘హెస్పెరిడిన్‌’ ఉంది. ’సి విటమిన్‌‘ శరీరానికి వంటబట్టేలా ఈ హెస్పెరిడిన్‌ దోహదపడుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కేరెట్లో ఉండే బీటాకెరొటీన్‌ దీంట్లోనూ ఉండటాన, కాషాయ రంగులో దీని గుజ్జు ఉంటుంది. ఇది కంటిచూపునకు మేలు చేస్తుంది. గుండెను బలసంపన్నం చేస్తుంది. ఇందులో ఫాస్ఫరస్‌, పొటాషియం, కాల్షియం కూడా చాలినంత ఉన్నాయి. తొనలుగా తింటే గుజ్జు, పీచు కూడా ఏకంగా కడుపులోకి వెడతాయి.

జ్వరం రాగానే అన్నం మానేసి ఈ ఫలాల్ని తింటే వెంటనే జ్వరం ఉపశమిస్తుంది. జ్వరానికి వేసుకున్న బిళ్లలు బాగా పని చేస్తాయి. కొంతమందికి ఇవి జలుబు చేస్తాయనే భయం. వ్యక్తిగతంగా ఈ పండు సరిపడని వారికి తప్ప, తక్కినవారందరికీ జలుబుని తగ్గించే గుణమే వీటికి ఉంది. రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. అజీర్తిని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. నోటికి రుచిని కలిగిస్తుంది. గుండెకి మంచిది. వేడిని తగ్గిస్తుంది. తక్షణ శక్తినిస్తుంది. అలసట పోగొడుతుంది. వాతాన్ని, ఉద్రేకాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది.

  • నారింజ పండ్ల రసంతో పానకం చేసుకునే విధానాన్ని క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో వివరంగా పేర్కొన్నాడు:

  • బాగా పండిన ఫలాన్ని ఎంచుకుని, మధ్యకు కోసి, చక్కగా రసాన్ని పిండాలి.

  • ఈ రసంలో చాలినంత పంచదార కలపాలి. తగినంత అల్లం తీసుకొని, పొట్టు తీసి, మిక్సీ పట్టి, ముద్దగా చేయాలి. ఆ ముద్దని కూడా ఈ పండ్ల రసంలో కలపాలి.

  • పరిమళం కోసం కొద్దిగా పచ్చకర్పూరం కలిపితే కమ్మని ఆరోగ్యదాయకమైన నారింజపండ్ల రసం తయారవుతుంది. బత్తాయితోనూ, కమలాలతో కూడా ఇదే పద్ధతిలో పానకం లేదా షర్బత్‌ చేసుకోవచ్చు.

  • దీన్ని వేడి చేయటం, పాకం పట్టటం లాంటివి చేయకూడదు. అప్పటికప్పుడు కలుపుకోవటమే మంచిది.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Jul 13 , 2024 | 12:57 AM

Advertising
Advertising
<