ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Food Curiosity : బార్లీ గొప్ప చెప్పతరమా!

ABN, Publish Date - Nov 02 , 2024 | 12:32 AM

బార్లీ అంటే జ్వరాలు వచ్చినప్పుడు జావ కాచుకుని తాగేందుకు మాత్రమే వాడతారనే ఓ బలమైన అభిప్రాయం ఉంది. కానీ వరి కన్నా, గోధుమకన్నా బార్లీ అనేక రెట్లు ఆరోగ్యదాయకమైన, బలకరమైన, ప్రయోజనకరమైన ధాన్యం అని చాలా మందికి తెలీదు.

భోజన కుతూహలం

రూక్షశశీతో గురుః స్వాదుస్సరో విడ్వాత కృద్యవః

వృష్య స్సస్థైర్య కరోమూత్రమేదః పిత్తకఫాన్‌ జయేత్‌

పీనస శ్వాసకాసోరు స్తంభ కంఠత్వగామయాన్‌!

బార్లీ అంటే జ్వరాలు వచ్చినప్పుడు జావ కాచుకుని తాగేందుకు మాత్రమే వాడతారనే ఓ బలమైన అభిప్రాయం ఉంది. కానీ వరి కన్నా, గోధుమకన్నా బార్లీ అనేక రెట్లు ఆరోగ్యదాయకమైన, బలకరమైన, ప్రయోజనకరమైన ధాన్యం అని చాలా మందికి తెలీదు. ఆ మాటకొస్తే అన్ని ధాన్యాలకన్నా బార్లీయే ఎక్కువ శక్తిదాయకం కూడా! ఋగ్వేద కాలం నాటి ప్రజలకు బార్లీ ప్రధాన ఆహార ధాన్యం. వాళ్లు దానిని ‘యవలు’ అని పిలిచేవారు. ఈ పేరు రావటానికి కూడా ఒక కారణముంది. బుగ్వేద కాలంలో అంగుళంలో ఆరో వంతు ప్రమాణాన్ని ‘యవ’ అనేవారు. బార్లీ అంగుళంలో ఆరోవంతు ఉంటుంది కాబట్టి దీనిని ‘యవ’ అన్నారు. ఇదే విధంగా వేలిముద్రల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని వేళ్ల మీద గీతలు యవ కంకుల్లా కనిపిస్తాయి. అందుకే వేళ్ల మీద గీతల్ని యవ అంటారు. జ్యోతిష శాస్త్రంలో కూడా యావ అనేది ఒక యోగం. ఇక దీనికి శూకముండాఖ అనే పేరు కూడా ఉందని ‘భోజన కుతూహలం’ గ్రంథం పేర్కొంది.


  • అనేక గుణాలు...

బార్లీ గింజలకు ‘లేఖనం’ అనే గుణం ఉంది. అంటే జిడ్డుని తొలగింస్తుందన్నమాట. శరీరంలో జిడ్డుని కలిగించేది కొవ్వు. ఆ కొవ్వుని తగ్గించే శక్తి బార్లీకుంది. అందువ్ల స్థూలకాయులకు ఇది దివ్యౌషధమని ఆయుర్వేదం పేర్కొంటుంది. అంతే కాదు... మిగతా ధాన్యాలకన్నా ఆహార పీచు (డయటరీ ఫైబర్‌) బార్లీలో ఎక్కువ. ‘గురు’ అనే గుణం కలిగి ఉండటం చేత బార్లీ ఆలస్యంగా జీర్ణం అవుతుంది. అందుకని షుగరు రక్తంలో చేరకుండా, షుగరు సూచిక వెంటనే పెరగకుండా ఆపుతుంది. బార్లీ గింజలకు కడుపులో, మూత్రంలో, విరేచనంలో మంటను తగ్గించే గుణం ఉంది. మూత్రాశయంలో కలిగే ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది కూడా. ఊపిరితిత్తుల్లో పేరిన కఫాన్ని తగ్గిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. గొంతులో వచ్చే వ్యాధుల్లో బార్లీ ఔషధంగా ఉపయోగపడ్తుంది. దీర్ఘకాలం వదలని పడిశ భారాన్ని తగ్గిస్తుంది. దగ్గుని, ఆయాసాన్ని, ఉబ్బసాన్ని నివారిస్తుంది. కండరాలు పట్టేయటాన్ని ఆపుతుంది. రక్త దోషాల్ని, దప్పికని తగ్గిస్తుంది. వడ దెబ్బ తగలకుండా ఆపుతుంది. గడ్డల్ని కరిగించే ఫెరూలిక్‌ యాసిడ్‌ అనే రసాయనం ఇందులో ఉంటుంది. ఇది ట్యూమర్లను, కేన్సర్‌ గడ్డల్ని కరిగిస్తుంది. కేన్సన్‌ ముదరకుండా సాయపడుతుంది.


  • బార్లీ నీళ్లే కాదు...

బార్లీ గింజల్లో నీళ్లు పోసి, మెత్తగా ఉడికించి, వార్చిన జావ తాగుతుంటారు. కానీ, గింజల్ని వదిలేస్తుంటారు. ఇది సరికాదు. నీటిలో కరిగే స్వభావం ఉన్న పోషకాలు మాత్రమే ఈ జావలోకి వస్తాయి. మిగిలిన మినరల్స్‌, ఫైబరు వగైరా ఆ గింజల్లోనే ఉండిపోతాయి. అందుకని గింజలతో సహా జావ తాగాలి. బార్లీ, గోధుమ పిండిని చెరిసగం కలిపి తయారు చేసిన చపాతీలు, పుల్కాలు ఎంతో మృదువుగానూ, ఆరోగ్యదాయకంగానూ ఉంటాయి. దోశలు ఇతర పిండివంటల్లో కూడా బార్లీని కలుపుకోవచ్చు. కొందరు బార్లీని దోరగా వేగించి మెత్తగా మిక్సీ పట్టిన పిండిని కూరల్లోనూ పులుసుల్లోనూ చిక్కదనం కోసం వాడుతుంటారు. ఈ పిండిని నీళ్లలో వేసి ఉడికించగా వచ్చిన చిక్కని గంజిలో ఉప్పు గానీ తీపి గానీ నిమ్మరసం గానీ కలుపుకుని తాగుతారు. సమానంగా పెరుగు కలిపి మిక్సీ పట్టిన బార్లీ మజ్జిగవల్ల ప్రోబయాటిక్‌ ప్రయోజనాలు కూడా అదనంగా అందుతాయి. బి- విటమిన్‌ లోపంతో బాధపడేవారికి రోజూ రెండు చెంచాల బార్లీ పిండిని జావకాచి ఇస్తుంటే విటమిన్‌ మాత్రల అవసరం ఉండదు. మూత్రపిండాలలో రాళ్లు కరిగించే గుణం దీనికి ఉంది. విరేచనం ఫ్రీగా అవుతుంది. ఎక్కువగా నడవటం ద్వారా నీరు పట్టటం తగ్గుతుంది. చర్మానికి మంచి రంగుని, మృదుత్వాన్ని ఇస్తుంది. బీపీ త్వరగా తగ్గేందుకు తోడ్పడుతుంది. అతిసారం, కలరా లాంటి వ్యాధుల్లో చిక్కని బార్లీ జావని పెరుగు కలిపి, చిలికి, ఉప్పు, పంచదార వేసి తాగితే విరోచనాలు తగ్గుతాయి.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Nov 02 , 2024 | 12:32 AM