Doctor : ఒళ్లంతా అల్ట్రాసౌండ్
ABN, Publish Date - Jul 16 , 2024 | 12:51 AM
మనం ఎంత దూరం నడుస్తున్నామో.. మన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో.. బీపీ.. సుగర్‌లు ఎంత ఉన్నాయో చెప్పే పరికరాలు ఇప్పటికే మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
మనం ఎంత దూరం నడుస్తున్నామో.. మన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో.. బీపీ.. సుగర్‌లు ఎంత ఉన్నాయో చెప్పే పరికరాలు ఇప్పటికే మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. మన చర్మం లోపల నుంచి సెన్సర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇవి మనకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తాయి.
మన శరీరంలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలంటే ఎక్స్‌రేలు, అలా్ట్రసౌండ్, ఎంఆర్‌ఐలు అవసరమవుతాయి. అలా్ట్రసౌండ్ పరికరాలు- ఒక రకమైన ధ్వని తరంగాలను (సోనార్లు) శరీరంలోకి పంపి.. అవి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు- వాటి ద్వారా శరీరరంలోని అవయవాల పరిస్థితిని తెలియచెబుతాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అలా్ట్రసౌండ్ పరికరాలను ఒక చోట మాత్రమే ఉంచి ఉపయోగించగలుగుతాము.
తాజాగా ఈ విషయంలో వైద్య శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనలు విజయవంతమయ్యాయి. శరీరంపై టేపుల్లా అతికించుకొనే అలా్ట్రసౌండ్ పరికరాలు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. ఈ పరికరాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం..
అల్ట్రాసౌండ్ ప్యాచ్‌లు నిరంతరం ధ్వనితరంగాలను శరీరంలోకి పంపుతూ ఉంటాయి. దీని ద్వారా గుండె ఎలా పనిచేస్తోందో.. రక్త ప్రసారం ఎలా అవుతోందో..కండరాల పరిస్థితి ఎలా ఉందో.. రక్తప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
ప్యాచ్‌పై ఉన్న వైర్‌లెస్ కంట్రోల్ పరికరం సంకేతాలను చిత్రాలుగా మార్చి ఫోన్‌కు పంపుతుంది. దీని ద్వారా మన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ప్యాచ్‌లు చర్మం లోపలి ప్రాంతాల నుంచి సంకేతాలను సులభంగా అందుకోగలుగుతాయి కండరాలు అలా్ట్రసౌండ్ సంకేతాలను తిరిగి పంపుతాయి
Updated Date - Jul 16 , 2024 | 12:51 AM