NRI News: ఘనంగా AIA ‘స్వదేశ్’.. స్వాతంత్ర్య దినోత్సవం
ABN, Publish Date - Aug 15 , 2024 | 02:50 PM
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ (AIA) & బోలీ 92.3 ఆధ్వర్యంలో డౌన్‌టౌన్ శాన్ జోస్ వీధుల్లో మొదటి సారిగా ఇండియా పరేడ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని...
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ (AIA) & బోలీ 92.3 ఆధ్వర్యంలో డౌన్‌టౌన్ శాన్ జోస్ వీధుల్లో మొదటి సారిగా ఇండియా పరేడ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని 45+ భారతీయ సంస్థలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా 100+ అడుగుల భారత జెండాతో 10,000 మంది భారతీయులు రంగు రంగుల దుస్తులతో సాన్ జోస్ న్‌టౌన్‌లో పెరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, కళారూపాలను ప్రదర్శించడం, ప్రచారం చేయడం స్వదేశ్ యొక్క ముఖ్య నినాదాలలో ఒకటి అని చెప్పారు.
కార్యక్రమం సందర్భంగా 300 మంది పిల్లలు శాస్త్రీయ, చలనచిత్ర నృత్యాల పోటీల్లో పాల్గొన్నారు. AIA రాక్‌స్టార్ గాన పోటీ విజయవంతమైంది. అదేవిధంగా క్యారమ్స్, చదరంగం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు కళాశాల విద్య కోసం స్కాలర్‌షిప్‌లను అందించారు. భారత కాన్సుల్ జనరల్ (SFO) డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భారతదేశ వారసత్వం, సంస్కృతిని కాపాడటంలో AIA చేస్తున్న కృషిని ప్రశంచిచారు. ఈ సందర్భంగా శాన్ జోస్ మేయర్ మాట్ మహన్ సంయుక్త జెండాను ఎగురవేసి శుభాకాంక్షలను తెలియజేశారు.
సిలికాన్ వ్యాలీ వ్యాప్తంగా 50 మందికి పైగా ఎన్నికైన అధికారులు (మేయర్‌లు, సిటీ కౌన్సిల్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, ఇతరులు) స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. సంబంధిత భారతీయ రాష్ట్ర సంస్కృతి, వారసత్వంతో అలంకరించబడిన అనేక ఫ్లోట్‌లు కవాతులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా AIA శ్రీమతి ఝాన్సీ రెడ్డికి ‘‘ఎక్స్‌మ్ప్లరీ ఉమెన్ లీడర్’’ అవార్డును, ప్రముఖ సంగీత విద్వాంసుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీ.మహేష్ కాలేకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. ఈ ఉత్సవాలు రాత్రి 11:00 గంటల వరకు జరిగాయి.
అద్భుతమైన విజయ భారత్ - రాష్ట్ర నృత్యాలు & శాస్త్రీయ నృత్యాలు, ఫైర్ షో, లైవ్ సింగింగ్ కచేరీ & DJ సంగీతంతో కూడిన అద్భుతమైన సంగీత వినోదంతో కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను అలరించింది. ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో వాలంటీర్‌లు కృషి చేసినందుకు AIA బృందం ధన్యవాదాలు తెలియజేశారు. సంజీవ్ గుప్తా CPA గ్రాండ్ స్పాన్సర్, ప్లాటినం స్పాన్సర్ నాగరాజ్ అన్నయ్య, ట్రావెలోపాడ్ (ట్రావెల్ పార్టనర్), లుర్నిగో (ఎడ్యుకేషన్ పార్టనర్), గోల్డ్ స్పాన్సర్ వర్కాస్, నమస్తె ఆంధ్ర (మీడియా పార్టనర్) & ఇతర స్పాన్సర్‌లలో ICICI బ్యాంక్, ఆన్‌షోర్ కరే, జ్యోతిష్య పండిట్ విష్ణు, ఆజాద్ ఫైనాన్షియల్స్ పాల్గొన్నారు. AIA చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి aiaevents.org లో సందర్శించండి.
Updated Date - Aug 15 , 2024 | 02:50 PM