ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AAP: ఈడీ బెదిరింపులతోనే రాజ్ కుమార్ రాజీనామా.. అతిశీ కామెంట్స్..

ABN, Publish Date - Apr 11 , 2024 | 05:22 PM

దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను అరెస్టు చేసిన ఈడీ మరికొందకు ఆప్ నేతలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది.

దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను అరెస్టు చేసిన ఈడీ మరికొందకు ఆప్ నేతలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది. ఈ పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజ్ కుమార్ ఆనంద్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దిల్లీ రాజకీయాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుమార్ రాజీనామాపై స్పందించిన మంత్రి అతిశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ బెదిరింపులతోనే ఆయన రాజీనామా చేశారని వెల్లడించారు. రాజ్‌కుమార్ ఆనంద్ పట్ల తమకు సానుభూతి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..

రాజ్ కుమార్ ఆనంద్ పై చాలా ఒత్తిడి ఉంది. ఈడీ బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రతి వ్యక్తి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లు కాలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా వారందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు. తప్పుడు ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారనే విషయం దిల్లీ ప్రజలకు తెలుసు. ఉచిత విద్యుత్, ఉచిత నీరు, నాణ్యమైన పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు అందించిన కేజ్రీవాల్ తప్పు చేశారంటే వాళ్లు నమ్మడం లేదు. సీఎం అరెస్టు విషయంలో ఈడీ తీరుపై వారు చాలా కోపంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సరైన గుణపాఠం చెబుతారు.

- అతిశీ, ఆప్ మంత్రి


Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..

రాజ్ కుమార్ ఆనంద్ ఎందుకు రాజీనామా చేశారో అందరికీ తెలుసన్న అతిశీ నవంబర్‌లో ఆయన ఇంటిపై 23 గంటల పాటు దాడులు నిర్వహించారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అతిశీ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఓటర్లకు వివరిస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 05:22 PM

Advertising
Advertising