ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI News: ‘టీపాడ్’ బ్లడ్‌ డొనేషన్ క్యాంప్‌ విజయవంతం

ABN, Publish Date - Aug 14 , 2024 | 02:29 PM

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌).. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐటీ స్పిన్’ కేంద్రంగా 14వ సారి నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి...

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌).. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐటీ స్పిన్’ కేంద్రంగా 14వ సారి నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో అల్లెన్, ఎంసీ కిన్నే, ప్రాస్పర్‌, ప్లేనో, ఇర్వింగ్‌, కొప్పెల్‌ ప్రాంతాల నుంచి బ్లడ్‌డోనర్స్‌ తరలివచ్చారు.


దాతల నుంచి 38 పింట్ల రక్తాన్ని స్వీకరించి స్థానిక బ్లడ్‌బ్యాంక్‌ అయిన ‘కార్టర్‌ బ్లడ్‌కేర్‌’కు అందజేశారు. టీపాడ్‌ నిస్వార్థ సేవలను గుర్తించిన కార్టర్‌ బ్లడ్‌కేర్‌.. డీఎఫ్‌డబ్ల్యూ మెట్రో ప్రాంత కమ్యూనిటీ చాంపియన్‌గా అభివర్ణించింది. రక్తదాన శిబిరం, దాతలకు సదుపాయం, కార్టర్‌ బ్లడ్‌కేర్‌ ఏర్పాట్ల కోసం తన కార్యాలయ ప్రాంగణాన్ని పదేళ్లుగా కేటాయిస్తున్న ఐటీ స్పిన్ నిర్వాహకులను అంతా అభినందించారు.


ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ పురిటిగడ్డ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూనే జన్మ భూమికి కొంత తిరిగిచ్చేయాలన్న సంకల్పంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీపాడ్ ఆధ్వర్యంలో పదేళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గడిచిన మూడేళ్లుగా ఏడాదికి రెండు క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 1614 మంది ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే 540 పింట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు.


రత్న ఉప్పల సమన్వయంతో జానకీరామ్‌ మందాడి (ఎఫ్‌సీ చెయిర్‌), రూప కన్నయ్యగారి (ప్రెసిడెంట్‌), బుచ్చిరెడ్డి గోలి (బీవోటీ చెయిర్‌), రవికాంత మామిడి (కో-ఆర్డినేటర్‌) నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమానికి టీపాడ్‌ సభ్యులందరూ తమ సహకారం అందించారు. అదేవిధంగా స్థానిక పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా సేవలందించారు. ఏటా రక్తదాతలు సహకరించడం వల్లే తాము కమ్యూనిటీ చాంపియన్లుగా నిలుస్తున్నామని టీపాడ్‌ సభ్యులు పేర్కొన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 02:30 PM

Advertising
Advertising
<