ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Saudi Arabia: సౌదీలో ప్రాణాలు కోల్పోయిన తండ్రి.. చూడలేకపోయిన కొడుకు

ABN, Publish Date - Aug 06 , 2024 | 08:09 PM

ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.

Father Died At Saudi Arabia

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఎక్కడో దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి అదే ఎడారిలో ఉన్న కొడుకు తపించి పోయాడు, తనను భుజాల మీద మోసి పెంచి పెద్ద చేసినప్పటి నుండి ముంబాయి నుండి సౌదీకు విమానం ఎక్కించె వరకు తనను ఆదుకోన్న తండ్రి శవాన్ని చూడడానికి అనుమతించమని చేసిన రోదన అరణ్యరోదనగా మారింది. చివరకు సాహసం చేసి బానిస సంకెళ్ళు తెగించుకోని పారిపోయి కష్టంగా 900 కిలో మీటర్ల దూరానికి చేరుకోనె లోపు తండ్రి శవం మాతృదేశానికి వెళ్ళిపోయిందని తెలుసుకోని కన్నీరు మున్నీరవుతున్న కొడుకు కన్నీటి కథ ఇది.


ఒక వైపు చివరిచూపు దక్కకపోవడం మరో వైపు చేతిలో చిల్లి గవ్వ లేకుండా తినడానికి తిప్పలు పడుతూ రియాధ్ నగర రోడ్ల పై అవస్ధలు పడుతున్న 20 ఏళ్ళ మోహమ్మద్ మున్న తనకు సకాలంలో వేతనం చెల్లించకపోవడంతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా కష్టాలు పడుతున్నాడు. కనీసం తండ్రిను చూడడానికి తనకు అనుమతించలేదని ఆక్రోషానికి తోడుగా నితఖాత్ నిబంధన వలన కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉండడంతో స్వదేశానికి వెళ్ళడానికి సవాలక్ష ఇబ్బందులను ఎదుర్కోంటున్నాడు.


కామారెడ్డి జిల్లా శబ్దిపూర్ కు చెందిన మహమ్మద్ షరీఫ్ భారతదేశం నుండి వచ్చిన నాలుగు రోజులకు ఒక పార్కులో చనిపోయి నెలన్నరకు పైగా సమాచారం లేక ఇటు సౌదీ పోలీసులు అటు కుటుంబ సభ్యులు విచారించిన విషయం విదితమె. సౌదీకు వచ్చిన మూడు రోజులకు మరణించిన తండ్రి చావు వార్త ఇక్కడె ఉన్న తనకు నెలన్నర తర్వాత తల్లిద్వార తెలిసిందని మున్న చెప్పాడు. దేశం కానీ దేశంలో అందునా పరాయి భాషా, ఎడారి ప్రాంతాలలో మృత్యు చాలిస్తే మృతునితో పాటు అతని యావత్తు ఆత్మీయులకు సైతం ఆత్మ శాంతి లేకుండాపోతుంది, అసలు మనిషి జీవించి ఉన్నాడా లేదా, మరణిస్తే మృతదేహాం ఎక్కడ అనే అన్వేషణలో కన్నీరుమున్నీరుతో తెలుగునాట గ్రామీణ ప్రాంతాలలలోని కుటుంబాల ఆవేదన, ఆక్రోశం వర్ణానాతీతం.


ఎడారి నాట ఎవరు లేని వారిను ప్రక్కన పెడితె ఉన్న వారు సైతం తమ వారిను కనుక్కోవడం కత్తి మీద సాము. తాను ఉన్న దేశంలోనె కన్న తండ్రి చనిపోతె సైతం ప్రతికూల పరిస్ధుతల కారణాన కడచూపుకు నోచుకోలేక లేని దౌర్భగ్య పరిస్ధితి కూడ ఎదుర్కోవల్సి వస్తుంది. పార్కులలో పారిశుధ్య పనులు చేసే మున్న పని చేసే ఈ కంపెనీలో సుమారు 300 మందికు పైగా భారతీయులుండగా అందులో కొందరు తెలుగు వారు కూడ ఉన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 09:14 AM

Advertising
Advertising
<