ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI News: ఖతర్‌లో కాకతీయ కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 03:05 PM

ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు ఖతర్ కాకతీయ కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము పూజలతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉల్లాసభరితంగా, అధ్యాత్మికంగా సాగింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో అంగరంగ వైభవంగా సాంస్కృతిక, భక్తి పారవశ్యంతో అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు అగ్రగణ్యులు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు తెలుగు కుటుంబాలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా కార్తీక కర్తవ్యాన్ని పాటిస్తారు. అది ఎడారయినా మరో ప్రదేశమైనా భక్తి, ఆరాధానకు అడ్డంకి కాదు.

కార్తీకంలో శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడనేది భక్తుల విశ్వాసం. అందుకే ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు ఖతర్ కాకతీయ కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము పూజలతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉల్లాసభరితంగా, అధ్యాత్మికంగా సాగింది.


ప్రవాసంలో పుట్టి పెరుగుతున్న చిన్నారులకు తమ సంస్కతి, ఆచార వ్యవహారాలను చాటి చెప్పేందుకు ఈ ఆవకాశాన్ని నిర్వహకులు వినియోగించుకోన్నారు. రేయింబవళ్ళు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన ఈ అధునిక కాలంలో పిల్లలకు ఖోఖో, పరుగు పందెం వంటి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పిల్లలను తల్లిదండ్రులు ఉత్సహాపరుస్తూ ప్రొత్సహించారు.


కార్తీక వన భోజనాల సందర్భంగా వంటవార్పు, శివ పూజలే కాకుండా మహిళలు వివిధ క్రీడ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొన్నారు. రజనీ బొందలపాటి ప్రత్యేక చొరవ తీసుకోని మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా, పురుషులు వివిధ సంప్రదాయ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల పట్ల ఎనలేని ఉత్సుకత ప్రదర్శించారు.


29 రకాల రుచికరమైన వంటకాలను కాకతీయ కుటుంబ సమ్మేళనం వడ్డించింది. శ్రీనివాస బాబు అందించిన ఉసిరి ఆవకాయ పచ్చడి అనేక మందికి నచ్చింది. అందరికీ భోజనాలు అందించడానికి వాలంటీర్లు కృషి చేశారు. సాయంత్రం ముగింపు సందర్భంగా మహిళలు, పురుషుల మధ్య నిర్వహించిన అంతక్షరి గేయ పోటీలు ఉత్కంఠతో కొనసాగాయి. ఈ కార్యక్రమం అందరిలోనూ ఎనలేని ఉత్సహాన్ని నింపింది.


దేవినేని పుజ్వల, పెమ్మసాని శిరీష ప్రత్యేక శ్రద్ధ వల్ల వనభోజన కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని అభినందించారు. అదేవిధంగా, కాకతీయ కుటుంబ సమ్మేళన ప్రతినిధులు ఆంజనేయులు మాదినేని, శాంతయ్య యలమంచిలి, రమణయ్య గొట్టిపాటి, శ్రీనివాస్ దేవినేని, కవీంద్ర గాలి, శ్రీనివాసరావు యలమంచిలి, కోటేశ్వరరావు మన్నె, శ్రీనివాస రావు చండ్ర (నాని) అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాకతీయ కుటుంబ సమ్మేళనం మున్ముందు కూడా అనేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 03:06 PM