ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

America: లాస్ ఏంజెల్స్ పసుపుమయం.. కూటమి విజయంపై ఎన్‌ఆర్ఐల ధూంధాం సంబరాలు

ABN, Publish Date - Jun 19 , 2024 | 10:17 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయం కోసం అమెరికా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు.

న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయం కోసం అమెరికా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఎన్డీయే కూటమి విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెల్స్ సిటీ సిమి వాలీలో నగర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కిషోర్ గరికపాటి, జనసేన పార్టీ ఎన్నారై సమన్వయకర్త వెంకట్ అరసాలా, బీజేపీ నాయకుడు వాసు రెడ్డి వావిలాల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్బంగా కూటమి నాయకులు100 కార్లతో ర్యాలీ తీశారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక , నిరంకుశ పాలనాపై పోరాటం చేసిన కార్యకర్తలను, అమరావతి రైతులని గుర్తుచేసుకుంటూ అభిమానం చాటుకున్నారు.


నందన్ పొట్లూరి, రంగారావు నన్నపనేని, ప్రతాప్ మేడరామిట్ట, హేమ కుమార్ గొట్టి పలువురు NRI లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కూటమి విజయానికి దోహదపడ్డారు. అమెరికా నుంచి వెళ్లి మాతృభూమికి ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్, వెనిగండ్ల రాము, సురేష్ కాకర్ల, రోషన్ కుమార్‌లను అభినందించారు.


విజయోత్సవ సంబరాలను విజయవంతం చేసిన టీడీపీ నేతలు కిశోర్ గరికపాటి, సురేష్ అంబటి, హేమ కుమార్ గొట్టి, వెంకట్ గంటా, శ్రీహరి కొంక, రాజేంద్ర చింతమనేని, సుధీర్ కోనేరు, మధు బోడపాటి, గురు కొంక, నరేంద్ర పిన్నమనేని, చందు గుత్తికొండ, వేణు జెట్టి, జనసేన పార్టీ ఎన్నారై సమన్వయకర్త వెంకట్ అరసాలా, జనసేన పార్టీ కార్యకర్తలు అరుణ్ గిడ్డ, కార్తీక్ చిక్కాల, కేవీఆర్ సిద్దార్థ్ లను సభకు అథిథులుగా వచ్చిన శరత్ కామినేని, రవి ఆలపాటి, విజయ్ భాస్కర్, శ్రీహరి అట్లూరి, శ్రీధర్ సాతులూరి, రాజు కాకర్లపూడి, మురళి రెడ్డి, చందు పల్లబోయిన, ప్రతాప్ గద్దె తదితరులు కొనియాడారు.

Updated Date - Jun 19 , 2024 | 10:17 AM

Advertising
Advertising