ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: బే ఏరియాలో 'తెలుగుదేశం-జనసేన-బీజేపీ' ఎన్నారైల ఆత్మీయ సమావేశం!

ABN, Publish Date - Mar 11 , 2024 | 02:44 PM

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బేఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైన ఎన్నారైలు ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఎన్నారై డెస్క్: అమెరికాలోని (USA) శాన్‌ఫ్రాన్సిస్కో బేఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైన ఎన్నారైలు (NRI) ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 'సేవ్ ఆంధ్రా' అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు ఆత్మీయంగా కలుసుకుని రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో ఎన్‌డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తామంతా ఏవిధంగా సహాయపడాలి, తమవంతు సహాయ సహకారాలు ఏవిధంగా ఎన్‌డీఏ కూటమికి అందించాలి అనే అంశాల్ని చర్చించారు.

USA: అమెరికాలో భారతీయ యువతి అదృశ్యం!

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా ఎలా అధోగతిపాలు అయిపోయిందో చెబుతూ పలువురు ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత రాష్ట్రం దుస్థితి చూసి బాధేస్తుందని విచారం వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పడి నాటి నుంచి ఇలాంటి తిరోగమనాన్ని రాష్ట్రం ఎప్పుడూ చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.


రాబోయే నెలరోజులు చాలా కీలకమైనవని, కుదిరిన వాళ్ళు గ్రౌండ్‌లోకి దిగాలని, కుదరనివాళ్ళు ఇక్కడినుండే మద్దతుగా పలు కార్యక్రమాలు చేయాలని తీర్మానించారు. తమ వంతు ఆర్థికసహాయాన్ని జనసేన-తెలుగుదేశం కూటమికి అందించాలని తీర్మానించుకున్నామని కూటమి సభ్యులు తెలియజేశారు.

ఈ సమావేశంలో తెలుగుదేశానికి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, శ్రీనివాస్ దేవల్ల, వెంకట్ కోగంటి, సత్య పోలవరపు, హరి సన్నిధి, జనసేనకు చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటితో పాటు తెలుగుదేశం, జనసేన, బీజీపీ పార్టీల అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని ఎన్నారై సంబంధిత వార్తల ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 02:55 PM

Advertising
Advertising