ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telugu Doctor: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి, నేడు ఎలుకపాడుకు మృతదేహం

ABN, Publish Date - Mar 09 , 2024 | 08:58 AM

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మూల్పూరు రమేష్ మనమవరాలు వేమూరు ఉజ్వల. ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లి కన్నుమూసింది. ఉజ్వల గోల్డ్ కోస్ట్‌లో గల గల బాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇంతలో విషాదం నెలకొంది.

ఏబీఎన్ ఇంటర్నెట్: స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లడమే తప్పయ్యింది. విహరం కోసం వెళ్లిన ట్రెక్కింగ విషాదం నింపింది. ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు ఉజ్వల వేమూరు (Ujwala Vemuru) కన్నుమూసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఉజ్వల (Ujwala Vemuru) మృతదేహన్ని ఈ రోజు అమ్మమ్మ స్వగ్రామం ఎలుకపాడు తీసుకొస్తున్నారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

నేపథ్యం ఇదే

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మూల్పూరు రమేష్ (Ramesh) మనమవరాలు వేమూరు ఉజ్వల. ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లి కన్నుమూసింది. ఉజ్వల గోల్డ్ కోస్ట్‌లో గల గల బాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇంతలో విషాదం నెలకొంది. మూల్పూరు రమేష్ కూతురు మైథిలికి వేమూరు వెంకటేశ్వర రావుతో వివాహాం జరిగింది. ఆ దంపతులు గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వారి కూతురే వేమూరు ఉజ్వల.

ఏం జరిగిందంటే..?

మెడిసిన్ పూర్తి చేసిన ఉజ్వల ఇటీవల పీజీ సీటు కూడా సంపాదించారు. పీజీ చేసి లైఫ్‌లో సెటిల్ అవుదామని అనుకున్న సమయంలో విషాదం నెలకొంది. మార్చి 2వ తేదీన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి ఉజ్వల లోయలో జారి పడింది. ఆ ప్రమాదంతో ఉజ్వల చనిపోయింది. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఉజ్వల భౌతిక కాయాన్ని శనివారం (ఈరోజు) ఎలుకపాడు తీసుకొస్తున్నారు. ఇక్కడ అంత్యక్రియలను నిర్వహిస్తారు.

మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 09:00 AM

Advertising
Advertising