NRI News: తానా టి-7 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటిన మహిళలు
ABN, Publish Date - Aug 28 , 2024 | 06:36 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహించిన టి-7 ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో మహిళలు ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆగస్టు 25న నార్త్ కరోలినాలోని కన్‌కోర్డ్‌లో ఉన్న కేజీఎఫ్ గ్రౌండ్లో ఈ పోటీలు జరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్వహించిన టి-7 ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో మహిళలు ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆగస్టు 25న నార్త్ కరోలినాలోని కన్‌కోర్డ్‌లో ఉన్న కేజీఎఫ్ గ్రౌండ్లో ఈ పోటీలు జరిగాయి. పోటీలకు ఎంట్రీ ఫీజుగా 150 డాలర్లను నిర్ణయించారు. విజేతలకు 275 డాలర్లు, రన్నర్‌కు 150 డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తానా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు.
తానా టి-7 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో మహిళా క్రికెటర్లు అద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభను చూసి చాలా మంది వారిని మరింత ప్రోత్సహించారు. క్రీడలపై ఉన్న అభిరుచితో ఓ వైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 టీమ్‌లు పాల్గొన్నాయి. శ్రీనాథ్ దేవర సెట్టి, శరత్ కామెంటరీ అందరినీ ఆకట్టుకుంది.
ఈ పోటీల్లో విజేతలుగా స్మైలింగ్ స్రైకర్స్, రన్నర్స్‌గా మాస్టర్ బ్లాస్టర్ నిలిచాయి. ఈ పోటీలకు వలంటీర్లుగా హాసిని నాగుబోయిన, శ్రీజ వంగల, కీర్తన కొత్తపల్లి వ్యవహరించారు. తానా మహిళా నాయకులు మాధురి ఏలూరి, అనూరాధ గుంటుబోయిన, అమూల్య కుడుపూడి, వసంత కావూరి తదితరులు ఈ పోటీలను విజయవంతం చేయడంలో సహకరించారు.
డాక్టర్ సుధ ఈడుపుగంటి (డెంటిస్ట్), పినివిల్లె డెంటల్ స్టూడియో, రియల్టర్ బాలాజీ తాతినేని, రియల్టర్ మోహన్ దగ్గుబాటి ఈ పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తానా ఇలాంటి పోటీలను మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరారు. బ్యాడ్మింటన్, పికెల్ బాల్, త్రోబాల్ టోర్నమెంట్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు తానా నాయకులు పేర్కొన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 06:36 PM