YS Sharmila son marriage: వైఎస్ రాజారెడ్డి వివాహానికి... జోధ్‌పూర్‌లో ఘనంగా ఏర్పాట్లు
ABN, Publish Date - Feb 17 , 2024 | 09:21 PM
పీసీసీ వైఎస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ వేడుకలు రాజస్థాన్ జోధ్ పూర్ ప్యాలెస్‌లో ఘనంగా చేశారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ వేడుకలను.. రాజస్థాన్ జోధ్ పూర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు.

ఫిబ్రవరి 17వ తేదీన వివాహం నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేశారు. 16 నుంచి 18 వ తేదీ వరకూ వేడుకలు జరగనున్నాయి. 18వ తేదీ ఉదయం ప్రత్యేక ప్రార్థనలు, సాయంత్రం తలంబ్రాల వేడుకలు నిర్వహించనున్నారు.

వైఎస్ రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకలు జనవరి 18వ తేదీన హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Updated at - Feb 17 , 2024 | 09:28 PM