కడప జిల్లా: జమ్మలమడుగు, కొండాపురం మండలం, గండికోట ప్రాజెక్టును జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం సందర్శించారు. గత ఐదుసంవత్సరాల వైఎస్ఆర్‌సీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి ఇరిగేషన్ శాఖే గురైందని.. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.