ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర ఆర్థిక సంఘంతో రేవంత్ రెడ్డి బృందం భేటీ..

ABN, Publish Date - Sep 11 , 2024 | 11:08 AM

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్‌ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. భారీ రుణభారం సవాల్‌గా మారిందని రాష్ట్ర ప్రభుత్వం 16వ కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లింది. గత ప్రభుత్వం పదేళ్లలో భారీగా అప్పులు చేసిందని, దీంతో రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం ఆ అప్పులను తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. ఈ అప్పుల భారం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకంగా పరిణమిస్తుందని పేర్కొంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణ రావు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

1/5

ప్రజాభవన్‌లో ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు

2/5

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి బృందం..

3/5

చేయీ చేయి కలుపుకుని ప్రజాభవన్‌లోకి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

4/5

కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్‌ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ప్రజాభవన్‌లో సమావేశం అయిన దృశ్యం...

5/5

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చములిస్తు్న్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Updated Date - Sep 11 , 2024 | 11:08 AM

Advertising
Advertising