ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద ప్రభావిత ప్రాంతాల్లో దామోదర్ రాజనర్సింహ పర్యటన..

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:22 PM

సంగారెడ్డి జిల్లా: వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సోమవారం ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పట్టణానికి అనుకొని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటలలో వరద కాలువలు పూడుకపోవడం , అధిక వర్షాలు పడడం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక, రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీలలోకి వచ్చింది. ఈ ప్రాంతాలను మంత్రి , మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

1/6

వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలు..

2/6

సంగారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ అధికారులు..

3/6

మంత్రి దామోదర్ రాజనర్సింహకు వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి వివరిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్..

4/6

చిన్నగా ఉన్న ఎర్రకుంట తూమును పరిశీలిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రక్కన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

5/6

వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి.. పరిస్థితిని మంత్రి దామోదర్ రాజనర్సింహకు వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్..

6/6

సంగారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ..

Updated Date - Sep 10 , 2024 | 12:22 PM

Advertising
Advertising