Drugs Racket: అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు... భారీగా డ్రగ్స్ స్వాధీనం
ABN , Publish Date - Dec 23 , 2024 | 05:10 PM
డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రగ్ ఫెడ్లర్‌లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలే అన్న చందంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు.

పోలీసులకు చిక్కడం.. ఆపై బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరిపాటిగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలామంది డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.
చాలాసార్లు యువకులు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో. విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకుంటున్నారు.
సోమవారం భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల దగ్గరి నుంచి రూ. 40 లక్షలు విలువచేసే 160 కిలోల గంజాయి ఒక స్విఫ్ట్ కారు స్వాదీనం చేసుకున్నారు. ములుగు వైపు నుంచి భూపాలపల్లికి వస్తున్న స్విఫ్ట్ కారును తనిఖీ చేయగా 75 ప్యాకెట్ల 160 కిలోల గంజాయి పట్టుకున్నారు. మీడియా సమావేశంలో భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే వివరాలు వెల్లడించారు. .
Updated Date - Dec 23 , 2024 | 05:55 PM