ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PV Narasimharao: పీవీ నరసింహరావు స్థిత ప్రజ్ఞుడు, బహుభాషాకోవిదుడు... పీవీకి ప్రముఖుల ఘన నివాళులు

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:11 PM

మాజీ ప్రధాని నరసింహారావు 20 వర్ధంతిని హైదరాబాద్‌లో ఇవాళ(సోమవారం) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రముఖులు భారీగా హాజరై నివాళులు అర్పించారు.

1/7

డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, తదితరులు నివాళులు అర్పించారు.

2/7

భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పీవీ వర్ధంతి సందర్భంగా సోమవారం నెక్లెస్‌ రోడ్డు, పీవీ మార్గ్‌లో గల పీవీ జ్ఞాన్‌ భూమిలోని ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.

3/7

పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

4/7

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

5/7

ఆర్థిక సంస్కరణల పితామహుడు , అపర చాణక్యుడు, బహుభాషా వేత్త పీవీ నరసింహా రావు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తి పీవీ నరసింహారావు అని ఉద్ఘాటించారు.

6/7

గొప్ప సంస్కరణశీలి, మేధావి పీవీ నరసింహారావు చరిత్రను దేశం ఎన్నటికీ మర్చిపోదని తెలిపారు.

7/7

దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి.. దివాలా అంచున ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడిన గొప్ప ఆర్థిక వేత్త పీవీ నరసింహారావు అని అన్నారు. పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన నిత్య విద్యార్థి అని ప్రముఖులు కొనియాడారు.

Updated Date - Dec 23 , 2024 | 04:21 PM