TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:47 PM
Telangana Elections 2024: తెలంగాణలో (Telangana) పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ (BJP) ఈ రెండు పార్టీలూ బీఆర్ఎస్‌ను (BRS) టార్గెట్ చేశాయి. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరిపోతుంటే.. ఎంపీలు ‘కారు’ దిగి కాషాయ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మరో నలుగురు సిట్టింగులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం..
తెలంగాణలో (Telangana) పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ (BJP) ఈ రెండు పార్టీలూ బీఆర్ఎస్‌ను (BRS) టార్గెట్ చేశాయి. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరిపోతుంటే.. ఎంపీలు ‘కారు’ దిగి కాషాయ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మరో నలుగురు సిట్టింగులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లోని అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరిపే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు హస్తం పార్టీలోకి వచ్చేయగా.. తాజాగా ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkatrao).. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఇదీ అసలు సంగతి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం.. టికెట్ దక్కించుకుని గెలిచి నిలిచారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా మొదట ఈ ఎమ్మెల్యేనే. అయితే తాను పార్టీ మారట్లేదు అని చెప్పిన తెల్లం.. తాజాగా మరోసారి సీఎం రేవంత్‌ను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. తెల్లం కుటుంబ సభ్యులను దగ్గరుండి మరీ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎం దగ్గరికి తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే త్వరలోనే ‘కారు’ దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ లేకుండా చేస్తానని గతంలో పొంగులేటి.. కేసీఆర్‌కు చాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చాలెంజ్‌ను నిలుపుకునే దిశగా ఇప్పుడు మంత్రి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తెల్లంను కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారని తెలియవచ్చింది. మొత్తానికి చూస్తే ఖమ్మంలో ‘కారు’ ఖాళీ అవుతోందన్న మాట.
బీఆర్ఎస్‌కే ఎందుకిలా..?
ఓ వైపు ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు.. ముఖ్యనేతలు వరుసగా ‘కారు’ దిగుతుండటం.. ఆ పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని చాటి చెప్పడానికి బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌కు మొదలుకుని మంత్రుల వరకూ.. కేటీఆర్, హరీష్ రావులు రోజూ ఛాలెంజ్‌లు చేస్తూనే వస్తున్నారు. ఇలా సవాళ్లు విసిరన మరుసటి రోజే ఎవరో ఒకరు పార్టీని వీడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో ఇక ఆలస్యం చేయకూడదని స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం నాడు కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో భేటీ కాబోతున్నారు. నేతల జంపింగ్‌లు.. మార్చి-10న కరీంనగర్‌లో సభ, పార్లమెంట్ ఎన్నికలు, జిల్లాలో పార్టీ నేతలపై పోలీసు కేసులు, భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించబోతున్నారు. అసలు బీఆర్ఎస్‌కు ఎందుకిలా జరుగుతోంది..? ఒకప్పుడు ఎలా ఉన్న పార్టీ .. ఇప్పుడెందుకు ఇలా తయారయ్యిందని ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి
AP Elections: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీలో ఫుల్ జోష్!
YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?
BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?
Telangana: అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ.. ఎవరీమె.. బీజేపీ టికెట్ ఎలా దక్కింది..!?
Updated Date - Mar 03 , 2024 | 12:53 PM