ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: ఉత్కంఠకు తెర.. అసెంబ్లీకి కేసీఆర్.. ఏం చేయబోతున్నారు..!?

ABN, Publish Date - Jul 22 , 2024 | 10:24 PM

అవును.. మీరు వింటున్నది నిజమే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (BRS Chief KCR) అసెంబ్లీకి వస్తున్నారు. రేపటి (జులై-23న) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లు బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది..

అవును.. మీరు వింటున్నది నిజమే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (BRS Chief KCR) అసెంబ్లీకి వస్తున్నారు. రేపటి (జులై-23న) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లు బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. జులై- 25న బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు గులాబీ బాస్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. సభలో ఏయే విషయాలు ప్రస్తావించాలి..? ఎలా వ్యవహరించాలి..? అనేదానిపై సభ్యులకు.. కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి చూస్తే.. ఇన్నాళ్లుగా సభకు సారొస్తారా..? లేదా..? అనే ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది.


ఇక యాక్టివ్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుందామని చూసి పత్తా లేకుండా పోయింది..! దీనికి తోడు ఎన్నికల ముందు మొదలైన జంపింగ్‌లు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ ఒకింత డీలా పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక యాక్టివ్ అయితే కానీ ఈ రూమర్లకు చెక్ పెట్టినట్లు అవుతుందని భావించిన బాస్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోతున్నారనే టాక్ నడుస్తోంది. అంటే సారు సభకు వచ్చి యాక్టివ్ అవ్వబోతున్నారన్న మాట. ఇదివరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ హాజరుకాలేదు. ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్‌ హాజరుకాబోతున్నారు.


ఏం మాట్లాడుతారో..?

ఎన్నికల్లో ఓటమి.. ఊహించని రీతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంపింగ్‌లు జరుగుతున్న వేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. దీంతో సారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఏం మాట్లాడుతారు..? సభకొచ్చి ఏం మాట్లాడుతారు..? పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడబోతున్నారు..? కాంగ్రెస్ ఇన్నాళ్ల పాలన, రైతు రుణమాఫీ.. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, విమర్శల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్ విడుదల, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఆరు గ్యారంటీల అమలు, ప్రజారోగ్యం, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలలో జాప్యంపై గళమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే.. గత ప్రభుత్వం తప్పిదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపైనే టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Jul 22 , 2024 | 10:30 PM

Advertising
Advertising
<