AP Elections: ఎక్కడికెళ్లినా, ఎటు చూసినా జనం.. అయినా వైఎస్ జగన్‌ను వెంటాడుతున్న భయం!!
ABN, Publish Date - May 04 , 2024 | 04:37 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే.. ‘సిద్ధం’ పేరిట వరుస సభలు.. ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర నిర్వహించిన జగన్ రెడ్డికి ఏ జిల్లాకు వెళ్లినా.. ఏ నియోజకవర్గానికి వెళ్లినా జనం బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికెళ్లినా, ఎటు చూసినా జగన్ చుట్టూరా జనమే కనిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇసుకేస్తే రాలనంత మంది జనం సభలకు వచ్చేశారు. ఇంకేముందిలే గెలిచేశామని జగన్ అండ్ కో అనుకుంటున్నప్పటికీ ఓటమి భయం మాత్రం వెంటాడుతూనే ఉందట.
ఏం జరుగుతోంది..?
ఎవరైనా రాజకీయ నాయకుడు ఫలానా చోట సభ పెడుతున్నారన్నా.. నియోజకవర్గానికి వచ్చేస్తున్నారని తెలిసినా ఇక సామాన్యులు మొదలుకుని కార్యకర్తలు, నేతల వరకూ ఏ రేంజ్‌లో హడావుడి చేస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక జగన్ విషయానికొస్తే.. జగన్ సొంత జిల్లాకు వెళ్లినా.. టీడీపీ కంచుకోటలకు వెళ్లినా ఒక్కటే జనం.. ఘన స్వాగతమే లభించింది. జనం మాత్రం వస్తున్నారు.. ఈ జనాలంతా పోలింగ్ వరకూ మనతోనే ఉంటారా..? అని ఒకరిద్దరు పెద్దలను జగనే స్వయంగా అడిగారట. మరోవైపు.. ఇప్పటి వరకూ వైనాట్ 175 అన్న జగన్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. ఎందుకంటే అన్నీ సక్రమంగానే ఉన్నా ఎక్కడో లోలోపల భయం మాత్రం వెంటాడుతూనే ఉందట. ఎందుకంటే.. ఒక సభకు మించి.. ఇంకో సభకు జనం వచ్చినా సరే పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే చర్చ వైసీపీలో నడుస్తోందట. ఇందుకు మేనిఫెస్టో.. ఐదేళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత, అవినీతి.. అభివృద్ధి లేకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి.
నాడు కేసీఆర్.. నేడు జగన్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఎక్కడ సభలు పెట్టినా జన సందోహమే. కానీ పోలింగ్ రోజున మాత్రం అబ్బే.. అదంతా సభల వరకే అన్నట్లుగా హస్తం గుర్తుపై ఒక్కటే గుద్దుడు.! ఐదేళ్ల పాటు ఎన్నున్నా.. ఏం జరిగినా సరే ‘గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే’ అన్నట్లుగా ప్రజల్లో పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ పెద్దలు భావించారు.. సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో ఎన్నికల్లో కారు పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు జగన్ విషయంలో కూడా వైసీపీ నేతలకు ఇదే భయమట. జనాలు ఏమనుకుంటున్నా సరే.. ఈ ఐదేళ్లలో ఏదో ఒకరూపంలో ఇంటింటికీ పథకాల రూపంలో లక్షల్లో డబ్బులిచ్చాం.. ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు.. ఆదరిస్తారని అనుకున్న వైసీపీ.. ఇప్పుడు డైలమాలో పడిందట. పథకాలు తీసుకున్న వాళ్లంతా ఓటేయాలని ఏముంది..? ఈ పథకాలకు మించే కూటమి మేనిఫెస్టో ఉండటంతో అధికార పార్టీలో ఒకింత ఆందోళన మొదలైందట. ఒక్క మాటలో చెప్పాలంటే.. కూటమి మేనిఫెస్టో వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయిందనేది గ్రౌండ్ లెవల్‌లో జరిగిన చర్చ. తెలంగాణలో జరిగిన సీన్.. ఏపీలోనూ ఎక్కడ రిపీట్ అవుతుందో అని పార్టీ శ్రేణులు భయపడిపోతున్నాయట. ఏం జరుగుతుందో.. జనాలు ఎటువైపు ఉన్నారో తెలియాలంటే జూన్-04 వరకూ వేచి చూడాల్సిందే మరి.
Read Latest AP News And Telugu News
Updated Date - May 04 , 2024 | 04:42 PM