ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu Desam: కొలిక్కిరాని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక.. ఎందుకింత కన్ఫూజన్!

ABN, Publish Date - Aug 10 , 2024 | 11:08 AM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది...

  • ఎమ్మెల్సీ ఎన్నికపై కూటమి కసరత్తు

  • తేలని అభ్యర్థి.. సీఎంతో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతల సమావేశం

  • గెలుపు ఖాయమన్న కొందరు.. పోటీకి దూరంగా ఉంటే మంచిదన్న మరికొందరు

  • పోటీ/అభ్యర్థి ఎంపికపై ఆరుగురితో కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ (YSR Congress) తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ.. ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని గట్టిగానే ట్రై చేస్తోంది. అయితే.. ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశం జరిగింది. నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాలో పార్టీల బలాబలాలపై చంద్రబాబునాయుడు చర్చించారు.


కొందరు అటు.. ఇంకొందరు ఇటు..!

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే ఊపుతో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకుంటామని కొందరు నాయకులు చెప్పారు. అభ్యర్థి ఎవరైనా గెలుస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలామంది సభ్యులు కూటమికి మద్దతు తెలిపారని వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను వైసీపీ ఉత్తర భారతదేశ యాత్రకు తీసుకువెళ్లిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వైసీపీతో పోల్చితే కూటమికి తక్కువ ఓట్లు ఉన్నాయని పేర్కొంటూ పోటీకి దూరంగా ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నేతలంతా మరోసారి కూర్చుని పోటీ/అభ్యర్థిపై తేల్చాలని అధినేత సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


రేసులో ఉన్నదెవరు..?

ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌రాజులతో కమిటీని ఏర్పాటుచేశారు. సీఎంతో సమావేశానికి పల్లా శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, సుందరపు విజయకుమార్‌, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు గండి బాబ్జీ, బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, తదితరులు హాజరయ్యారు. ఇదిలావుండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద సత్యనారాయణ, మాడుగుల నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, బత్తుల తాతయ్యబాబు సిద్ధంగా ఉన్నారు. ఇంకా బైరా దిలీప్‌ చక్రవర్తి పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తానికి చూస్తే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం రసవత్తరంగానే సాగేలానే కనిపిస్తోంది.

Updated Date - Aug 10 , 2024 | 11:14 AM

Advertising
Advertising
<