ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఎన్నికలకు ముందు సంచలన సర్వే విడుదల.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సర్వే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 07:18 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024లో (AP assembly Election 2024) గెలిచేదెవరు?. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కారును కుప్ప కూల్చాలని ఏపీ ప్రజలు నిర్ణయించారా? టీడీపీ-జనసేన కూటమిని విజయం అందించాలని డిసైడ్ అయ్యారా?. పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తూ తాజాగా సంచలన సర్వే విడుదలైంది. అసలే పోటీకి సరైన అభ్యర్థులు లేక.. ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చివేస్తున్న జగన్ సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ఉలిక్కిపడే సర్వే వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024లో (AP assembly Election 2024) గెలిచేదెవరు?. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కారును కుప్ప కూల్చాలని ఏపీ ప్రజలు నిర్ణయించారా? టీడీపీ-జనసేన కూటమిని విజయం అందించాలని డిసైడ్ అయ్యారా?. పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తూ తాజాగా సంచలన సర్వే విడుదలైంది. అసలే పోటీకి సరైన అభ్యర్థులు లేక.. ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చివేస్తున్న జగన్ సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ఉలిక్కిపడే సర్వే వచ్చింది. ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ (Pioneer Poll Strategies Private Limited) లేటెస్ట్ సర్వేను విడుదల చేసింది.

సీట్ల అంచనాలు..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని సర్వే అంచనా వేసింది. అధికార వైఎస్సార్‌సీపీ కేవలం 49 సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. 22 నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ-జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే లెక్కగట్టింది. వైసీపీకి 7 స్థానాలు వస్తాయని పేర్కొంది.

ఓటింగ్ షేర్ అంచనా ఇదే..

టీడీపీ-జనసేన కూటమికి ఓటింగ్ షేర్ భారీగా పెరగడం ఖాయమని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ తాజా సర్వే పేర్కొంది. ఈ కూటమికి 51.4 శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక వైఎస్సార్‌సీపీకి 42.6 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందని, ఓటింగ్ షేర్ 3 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక బీజేపీకి 1.3 శాతం, ఇతరులకు 1.4 శాతం ఓట్లు పడతాయని పేర్కొంది. ఇతర పార్టీల జాబితాలో సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, బీసీవై, జై భారత్ పార్టీ వంటి పార్టీలు ఉన్నాయని తెలిపింది.

గణనీయ సంఖ్యలో శాంపిల్స్ సేకరణ

ఫిబ్రవరి 15 - 29, 2024 మధ్య కాలంలో ఈ సర్వేను చేపట్టినట్టు ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టామని, 53,000 మంది అభిప్రాయాలను సేకరించినట్టు వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నారని వివరించింది.

ఇవి కూడా చదవండి..

AP Politics: 2017లో జరిగిన విషయాన్ని బయటపెట్టిన ఎన్నికల వ్యూహకర్త పీకే!.. వైసీపీ నేతలు అంత తహతహలాడారా?

TDP - AP Politics: ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ముఖ్యనేతలకు ఫోన్లు చేసి...

మరిన్ని ఏపీ వార్తల కోసం చేయండి


జిల్లాల వారీగా ఇవీ లెక్కలు





Updated Date - Mar 08 , 2024 | 08:15 PM

Advertising
Advertising