TDP: ఎన్డీఏలోకి టీడీపీ.. బీజేపీకి ఇచ్చే సీట్లు ఇవే..!
ABN, Publish Date - Mar 07 , 2024 | 11:11 PM
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ (TDP) దాదాపు చేరిపోయినట్టే. హస్తిన వేదికగా గురువారం నాడు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన కీలక భేటీలో చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ (TDP) చేరిపోయింది.! హస్తిన వేదికగా గురువారం నాడు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన కీలక భేటీలో చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది.
అవును.. ఎన్డీఏలోకే..!
అమిత్ షా నివాసంలో కీలక చర్చలు
షా, నడ్డాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు షా, నడ్డాను కలిసిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై మంతనాలు
సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చ
బీజేపీకి 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేసిన టీడీపీ
6 లోక్‌సభ,10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ
టీడీపీ ఇస్తామంటున్న స్థానాలు రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు
ఈ నాలుగు స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్ సభ స్థానాలు అడుగుతున్న బీజేపీ
కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం ఇస్తామంటున్న టీడీపీ
2014 లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలంటున్న బీజేపి
అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం అర్ధరాత్రిలోపు అధికారిక ప్రకటన
Updated Date - Mar 08 , 2024 | 08:34 AM