ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: ఎంపీ టికెట్ దక్కినా పోటీకి బొత్స ఝాన్సీ వెనకడుగు.. ఏమైందా అని ఆరాతీస్తే..!?

ABN, Publish Date - Feb 25 , 2024 | 01:50 PM

AP Elections 2024: విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSR Congress) వింత పరిస్థితి నెలకొంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని (Botcha Jhansi Lakshmi) నెలరోజుల కిందటే అధిష్ఠానం ప్రకటించింది. కానీ ఇంతవరకూ...

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSR Congress) వింత పరిస్థితి నెలకొంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని (Botcha Jhansi Lakshmi) నెలరోజుల కిందటే అధిష్ఠానం ప్రకటించింది. కానీ ఇంతవరకూ ఆమె ప్రచారం ప్రారంభించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు గట్టిగా రెండు నెలలు కూడా సమయం లేదు. అయినా ఆమె ప్రచారం ఊసెత్తకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అసలు ఆమె విశాఖ ఎంపీగా ఆమె పోటీ చేస్తారా?, లేదా? అనే చర్చ కూడా మొదలైంది.


జస్ట్.. వచ్చిపోతున్నారంతే..!

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారారాయణను అధిష్ఠానం విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నిలపాలని నిర్ణయించింది. దీంతో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న అక్కరమాని విజయనిర్మలను తొలగించి ఎంవీవీని ఆరు నెలల కిందట సమన్వయకర్తగా నియమించింది. విశాఖ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషించిన అధిష్ఠానం స్థానికంగా ఎవరూ కనిపించకపోవడంతో పొరుగు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మిని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఆమె పోటీ చేయడం ఖాయమని అంతా భావించారు. అయితే ఇన్‌చార్జిగా ప్రకటించి దాదాపు నెలరోజులవుతున్నా ఇంతవరకూ ఆమె ప్రజల్లోకి రాలేదు. కనీసం పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాండురంగాపురంలో గల బొత్స ఝాన్సీ ఇంటికి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి వచ్చేస్తున్నారు తప్పితే, ఇంతవరకూ నగరంలో ఆమె ఒక్క కార్యక్రమానికి కూడా హాజరుకాకపోవడంపై పలు రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నగరానికి కొత్త వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమిస్తే వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లి పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ సీనియర్‌ రాజకీయ నాయకుడైన బొత్స సత్యనారాయణగానీ, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఝాన్సీలక్ష్మి గానీ ఆ దిశగా ఇంతవరకూ ప్రయత్నించిన దాఖలాల్లేవని పార్టీ నేతలే పేర్కొంటున్నారు.


తొందరెందుకు..?

మంత్రి బొత్సను ఝాన్సీలక్ష్మి ఎప్పటి నుంచి ప్రచారం ప్రారంభిస్తారని అడిగితే... ‘తొందరెందుకు...మీరు ఎప్పుడంటే అప్పుడని’ చెప్పి సమాధానం దాటవేసేస్తున్నారు. ఇదిలావుండగా గత ఎన్నికల్లో అంతటి వైసీపీ ప్రభంజనంలో కూడా నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, వైసీపీకి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా తన భార్యను పోటీకి దింపడంపై బొత్స సత్యనారాయణ సందిగ్ధంలో ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు మరో 50 రోజులు కూడా గడువులేదని, అయినా ఎంపీగా పోటీకి దిగేది ఎవరో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2024 | 01:50 PM

Advertising
Advertising