ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Result 2024: అంతా దేవుడి స్క్రిప్ట్.. అవును అక్షరాలా నిజమే జగన్!

ABN, Publish Date - Jun 04 , 2024 | 01:15 PM

అవును.. అక్షరాలా దేవుడి స్క్రిప్టే..! ఏపీ ఎన్నికల ఫలితాలతో (AP Election Results) సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది..! 2019 ఎన్నికల్లో 23 సీట్లకే టీడీపీ (TDP) పరిమితం కావడంతో.. వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా హేళన చేసిందో.. ఎంతలా కించపరుస్తూ మాట్లాడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది..!

అవును.. అక్షరాలా దేవుడి స్క్రిప్టే..! ఏపీ ఎన్నికల ఫలితాలతో (AP Election Results) సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది..! 2019 ఎన్నికల్లో 23 సీట్లకే టీడీపీ (TDP) పరిమితం కావడంతో.. వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా హేళన చేసిందో.. ఎంతలా కించపరుస్తూ మాట్లాడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది..! అంతేకాదు.. ఆ 23లోనూ కొంతమందిని వైసీపీ లాగేసుకోగా మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయినా సరే ఎక్కడా అదరక బెదరక ఒంటరిగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒంటరిగానే పోరాటం చేశారు. ఇక ఎన్నికల ముందు బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగట్టిన టీడీపీ.. ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్నదంటే మామూలు విషయం కాదు. అది కూడా టీడీపీ నంబర్ వైసీపీకి రావడం అంటే దేవుడి స్క్రిప్ట్ అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా సీట్ల రూపంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగానే తెలిసొచ్చినట్లుంది.


విధి ఎంత విచిత్రమో కదా..!

వైనాట్ 175 అనే ట్రిబుల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్‌కు అది కూడా 20 లోపే సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి అంటే విధి ఎంత విచిత్రమో కదా..! అది కూడా టీడీపీతో కాదు జనసేనతో పోటీ పడి గెలవబోతోందంటే ఎక్కడ్నుంచి పరిస్థితి ఇంకెక్కడికి పడిపోయిందో కదా!. వైఎస్ జగన్ ఎప్పుడూ పైనున్న దేవుడు, ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయని అంటూ ఉంటారు కదా.. ఉన్నాయి కానీ కూటమికే ఇవన్నీ..! బహుశా వైసీపీకి ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా కార్యకర్తలు, పార్టీ నేతలు ఊహించి ఉండరేమో మరి. అందుకే అధికారం వచ్చిందని ఎగిరెగిరి పడితే పరిస్థితి ఎలా ఉంటుంది..? అభివృద్ధి పక్కనెట్టి బటన్ నొక్కుడే పనిగా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వైసీపీ అధినేతకు బాగా తెలిసొచ్చిందేమో!.


ఇక మోత మోగుతుందేమో..!

ఎక్కడైతే.. అదేనబ్బా బహిరంగ సభలు, సమావేశాలు.. అసెంబ్లీలో వైఎస్ జగన్ అండ్ కో 23.. 23 అని హేళన చేశారో.. ఇప్పుడు అవే వేదికగా టీడీపీ మోతెక్కిస్తుందేమో..! ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదేమో. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ నడుస్తుండగా.. ఇప్పుడిక తెలుగు తమ్ముళ్లు థాటి నుంచి వైఎస్ జగన్ ఎలా తట్టుకుంటారో.. ఎదుర్కొంటారో అని వైసీపీ శ్రేణులు కంగారు పడుతున్న పరిస్థితి. ఇవన్నీ కాదు.. వైఎస్ జగన్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందా అని.. టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఘోరాతి ఘోర ఓటమిపై ఏం మాట్లాడుతారో వేచి చూడాలి మరి.

Updated Date - Jun 04 , 2024 | 01:34 PM

Advertising
Advertising