AP Elections: ముద్రగడ విషయంలో ఇలా అయ్యిందేంటి.. వైసీపీలో అంతర్మథనం!!
ABN, Publish Date - May 03 , 2024 | 05:03 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ. సేనానిని నైతికంగా ఇబ్బంది పెట్టాలని.. కాపులను (టీడీపీ, బీజేపీ, జనసేన) కూటమికి దూరం చేయాలని నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలెట్టేశారు ముద్రగడ.
Elections 2024: ఎన్నికల ముందు రోజా బిగ్ షాక్.. గెలుపు కష్టమేనా..!?
సీన్ రివర్స్..!
రాజకీయాలే వద్దు అనే పరిస్థితి నుంచి రావాల్సిందేనని పట్టుబట్టి మరీ పక్కా ప్లాన్‌తోనే కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడను పార్టీలోకి చేర్చుకుంది వైసీపీ. కాపు ఉద్యమ నేత కావడం.. ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారని.. ఈయన వల్ల గోదావరి జిల్లాల్లో ఎంతో కొంత మేలు జరుగుతుందని వైసీపీ పెద్దలు ఎన్నో కలలు కన్నారట. అయితే ఆ కలలన్నీ కల్లలయ్యాయట. మొదట పవన్‌ను ఓడించే బాధ్యతలను కట్టబెట్టడంతో ఆ పనిలో ఉన్నారు ముద్రగడ. తనకు అప్పగించిన మండలంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అంతవరకూ ఓకేగానీ మీడియా ముందుకొస్తే చాలు.. పవన్‌ను తిట్టడం, ఇష్టానుసారం మాట్లాడటం, చాలెంజ్‌లు విసరడం ఇలాగే సరిపోయింది. అయితే.. ఎందుకో ఈయన ప్రవర్తన, చేష్టలు కన్న కుమార్తె క్రాంతికే నచ్చలేదు. దీంతో ఓ వీడియోను రిలీజ్ నాన్నకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అబ్బే.. అంతటితో ఆగలేదు.. తానేం తక్కువ తినలేదని వీడియోపై కుమార్తెకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఏదో అనుకుంటే ఇలా జరిగిందేంటి..? అని ఆలోచనలో పడిందట వైసీపీ.
AP Elections: నెల్లూరు ఎంపీగా గెలిచేదెవరు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరింటే..?
నమ్మే పరిస్థితి ఉందా..?
సొంతిటి మనుషులే నమ్మనప్పుడు ఇక కాపు ఓటర్లు, కాపు నేతలు.. ముద్రగడ చెప్పినట్లు వింటారా..? అన్నది ఇప్పుడు వైసీపీ పెద్దల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో ప్రశాంతంగా ఉన్న పిఠాపురంను ఇలా రచ్చ రచ్చకెక్కించడంతో కాపు నేతలు సైతం కన్నెర్రజేస్తున్న పరిస్థితి. అటు కుమార్తె వీడియోతో గట్టిగా ఇచ్చేయగా.. ఇటు మాజీ ఎమ్మెల్యే వర్మ రంగంలోకి దిగి ఇంటిపేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఇచ్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు వర్మ.
నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు
ప్రభావమెంత..?
మరోవైపు.. నియోజవర్గంలోని నేతలు కూడా పద్మనాభంను అంతంత మాత్రమే పట్టించుకుంటున్నారట. ఇక మీడియా ముందుకొచ్చి రచ్చజేస్తుండటంతో ఆ కాస్త కూడా పట్టించుకోకపోవడం.. అస్సలు లెక్కే చేయట్లేదట. ఒకప్పటి రోజులు కాదివి.. ఒకప్పడులా జరుగుతున్న ఎన్నికలు కూడా కావని రివర్స్‌గా పద్మనాభంకు కౌంటర్లు ఇచ్చేస్తున్న పరిస్థితి పిఠాపురంలో ఉందట. ఇక ఇతర నియోజకవర్గాల్లోని కొందరు కాపు నేతలు సైతం ఫోన్లు చేసి ఏందబ్బా.. ఈ గోల అంటూ క్లాస్ తీసుకుంటున్నారట. ఈ వరుస పరిణామాలతో వైసీపీ అంతర్మథనంలో పడిందట. ముద్రగడ ప్లస్ అవుతారనుకుని పిలిచి మరీ కండువా కప్పితే.. ఇంతలా మైనస్ అవుతున్నారేంటి..? అని వైసీపీ పెద్దలు నిట్టూరుస్తున్నారట. మరి కాపులు ఎటువైపు.. పిఠాపురంలో గెలుపెవరిది..? ముద్రగడ ప్రభావం ఎంత అనేది తెలియాలంటే జూన్-04వరకూ వేచి చూడాల్సిందే మరి.
Updated Date - May 03 , 2024 | 06:13 PM