Viral Video: తెలివంటే ఇదీ.. బైక్ ఇంజిన్, ఫ్యాన్‌తో వినూత్న వాహనం.. గాల్లోకి ఎగిరే చౌకైన విహంగం..
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:08 PM
కొందరు కుర్రాళ్లు చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. బీహార్‌కు చెందిన ఓ కుర్రాడు తాజాగా అలాంటి ఆవిష్కరణే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాలా తక్కువ ఖర్చుతో గాల్లోకి ఎగిరే వాహనాన్ని తయారు చేశాడు.
కొందరు కుర్రాళ్లు చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను (Talent) ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. బీహార్ (Bihar)కు చెందిన ఓ కుర్రాడు తాజాగా అలాంటి ఆవిష్కరణే (Innovation) చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాలా తక్కువ ఖర్చుతో గాల్లోకి ఎగిరే వాహనాన్ని తయారు చేశాడు. అతను తయారు చేసిన హ్యాండ్ గ్లైడర్ (Glider) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు (Viral Video).
jiteshkumar8134 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బీహార్‌కు చెందిన ఓ బాలుడు తయారు చేసిన హ్యాండ్ గ్లైడర్‌ను చూపించారు. ఆ గ్లైడర్ వాహనానికి ముందు ఓ హ్యాండిల్, వెనుక ఓ సీటు ఉంది. ఆ సీటు వెనుక గ్లైడర్ ఇంజన్ ఉంది. దాని వెనుక ఒక ఫ్యాన్‌ను అమర్చారు. ఆ గ్లైడర్‌కు పైన వస్త్రంతో చేసిన పెద్ద రెక్కలు ఉన్నాయి. ఆ గ్లైడర్ ముందుకు వెళ్లడాన్ని ఆ వీడియోలో చూపించారు. అయితే వీడియో చిత్రీకరించిన సమయంలో గాలి ఎక్కువగా ఉండడంతో గ్లైడర్ గాల్లోకి ఎగరలేదని చెబుతున్నారు. మరి, ఆ వాహనం గాల్లోకి ఎగరగలదా, లేదా అనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు.
సుమారు రూ.1.5 లక్షలతో ఈ గ్లైడర్‌ను సిద్ధం చేశామని, ఇందులో బైక్ ఇంజన్‌ను వినియోగించామని ఆ కుర్రాడు చెప్పాడు. ఈ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజంగా గాల్లోకి ఎగురుతుందా``, ``చాలా విచిత్రంగా ఉంది``, ``దీనిని నమ్మి గాల్లోకి ఎగిరితే పరిస్థితి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వావ్.. హిప్పోలు కూడా ఇంత బుద్ధిగా ఉంటాయా? పళ్లు తోముతుంటే హిప్పో ఏం చేసిందో చూడండి..
Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..