ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: లగేజీ మధ్య నుంచి వచ్చిన దాన్ని చూసి పరుగులు పెట్టిన ప్రయాణికులు.. అసలు విషయం ఇదే..

ABN, Publish Date - Nov 25 , 2024 | 10:17 AM

భోపాల్‌- జబల్‌పూర్‌ మధ్య నడుస్తున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎప్పటిలాగానే ప్రయాణం మెుదలుపెట్టింది. టికెట్లు తీసుకున్న ప్రయాణికులంతా రైలు ఎక్కారు. అనంతరం తమతమ సీట్లలో కూర్చున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పాములంటే భయపడని వారుండరు. చిన్నా, పెద్దా ఎవరైనా సరే పాము కనిపించిందంటే చాలు ఆమడ దూరం పారిపోతారు. ఇటీవల కాలంలో విష సర్పాలతో పరాచకాలు ఆడేవారు ఎక్కువైపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే అలాంటి వారికి సైతం పాము ఒక్కసారిగా ఎదురైతే చెమటలు పట్టడం ఖాయం. అలాంటిది వందల మంది ప్రయాణించే రైలులోకి పాము ఎంటరైతే ఎలా ఉంటుంది. ఆలోచిస్తేనే భయం వేస్తోంది కదా.. తాజాగా ఓ రైలులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.


తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. భోపాల్‌- జబల్‌పూర్‌ మధ్య నడుస్తున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎప్పటిలాగానే ప్రయాణం మెుదలుపెట్టింది. టికెట్లు తీసుకున్న ప్రయాణికులంతా రైలు ఎక్కారు. అనంతరం తమతమ సీట్లలో కూర్చున్నారు. వెంట తెచ్చుకున్న లగేజీని కొంతమంది ఒడిలో పెట్టుకోగా.. మరికొంతమంది లగేజీ ఓవర్ హెడ్‌లో పెట్టారు. అయితే అక్కడి వరకూ బాగానే ఉంది. కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఓవర్ హెడ్ లగేజీ మధ్య పాము ప్రత్యక్షం అయ్యింది. పైకి చూసిన ఓ ప్రయాణికుడు అక్కడ విష సర్పం ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే తోటి ప్రయాణికులకు విషయం చెప్పాడు.


ఒక్కసారిగా ఉలిక్కిపడిన వారంతా పరుగులు పెట్టారు. బోగీలో పాము ఉందని తెలుసుకున్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఔత్సాహికులు మాత్రం దాన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఓ వ్యక్తి అయితే మరీ దారుణంగా పాము నోటి వద్దకు సెల్ ఫోన్‌ను తీసుకెళ్లి చిత్రీకరించాడు. అనంతరం కొంతమంది రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు తర్వాతి స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపివేశారు. విష సర్పాన్ని సురక్షితంగా పట్టుకున్నారు. ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ హర్షిత్‌ శ్రీవాస్తవ తెలిపారు.


రైలు మెుత్తం శుభ్రం చేయించామని, కార్మికులను సైతం అప్రమత్తం చేసినట్లు హర్షిత్ శ్రీవాస్తవ చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సైతం ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే రైలులో పాము ప్రత్యక్షమైన వీడియోను కొంతమంది తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. "బాబోయ్.. నిజంగా ఆ పాము కిందపడి ప్రయాణికుల మధ్యకు వస్తే పరిస్థితే ఎలా ఉండేదో" అని కొందరు.. "అసలు రైలులోకి పాము ఎలా వచ్చిందబ్బా" అని మరికొందరు.. " పిచ్చి బాగా ముదిరింది.. పాముకు మరీ అంత దగ్గరగా వెళ్లి వీడియో తీయాలా" అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Actor Vinayakan: గోవాలో దాదాగిరి చేసిన నటుడు.. చివరికి ఏం జరిగిందంటే..

Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. ఘోర ప్రమాదం జరిగినా.. కారులో నుంచి ఎలా బయటపడ్డాడంటే..

Updated Date - Nov 25 , 2024 | 10:23 AM