ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trending: చుట్టూ చిమ్మ చీకటి.. ఎదురుగా సింహం.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..

ABN, Publish Date - Mar 20 , 2024 | 01:32 PM

ఈ భూమిపై జీవించే హక్కు మానవులకు ఎంత ఉందో మిగతా జీవులన్నింటికీ అంతే ఉంది. కానీ మానవులు మాత్రం స్వార్థంతో విచక్షణ మర్చిపోయి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. విచ్చలవిడిగా జంతువులను వేటాడేస్తున్నాడు.

ఈ భూమిపై జీవించే హక్కు మానవులకు ఎంత ఉందో మిగతా జీవులన్నింటికీ అంతే ఉంది. కానీ మానవులు మాత్రం స్వార్థంతో విచక్షణ మర్చిపోయి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. విచ్చలవిడిగా జంతువులను వేటాడేస్తున్నాడు. ఫలితంగా ప్రకృతి గతి తప్పుతోంది. వరదలు, కరవులు కమ్ముకుంటున్నాయి. అయితే అడవి పైకి కనిపించినంత అందంగా ఉండదు. అక్కడ బతకాలంటే నిత్యం పోరాటం చేయాల్సిందే. బలవంతుడే మనుగడ సాధిస్తాడు. బలహీనుడు ప్రాణాలు కోల్పోతాడు. ఇదే ప్రకృతి ధర్మం. అడవిలోని అన్ని జంతువుల కంటే సింహం బలవంతమైనది. దాని రాజసానికి అడవి జంతువులే కాదు మనుషులు సైతం భయపడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో సింహం, మనిషికి సంబంధించిన ఓ వీడియో వైరల్ ( Viral ) గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోను ఉత్తరాఖండ్ అటవీ అధికారి తీసినట్లు తెలుస్తోంది. చుట్టూ చీకటి అలుముకున్న రాత్రి సమయంలో ఓ బైకర్ వేగంగా సాగిపోతున్నాడు. కొద్ది దూరం వరకు కనిపించే బైక్ హెడ్ లైట్ వెలుతురునే అతను ముందుకు సాగిపోతున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఓ భయంకర దృశ్యం కనిపించింది. అతనికి ఎదురుగా ఓ సింహం ఠీవిగా నడుచుకుంటూ వస్తోంది. బైకర్ ముందు భయపడినా తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. బైక్ ను స్లో చేసి ఆపేశాడు. బైకర్ కు దగ్గరగా వచ్చిన సింహం పక్కనే ఉన్న గోడ ఎక్కి వెళ్లిపోయాడు. తనను సింహం ఏమీ చేయకపోవడంతో బైకర్ ఊపిరి పీల్చుకుంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.


ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కొద్ది సమయంలోనే వైరల్ గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 01:32 PM

Advertising
Advertising