ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: పాములకు గుండెపోటా... నిజమెంత?

ABN, Publish Date - Jul 30 , 2024 | 09:37 AM

పోటీ ప్రపంచంలో పరుగులు పెట్టడం వల్ల సాధారణంగా మనుషులు అనేక రోగాల బారిన పడుతుంటారు. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి, ఇతర కారణాలతో అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే పాములకు కూడా గుండెపోటు వస్తుందా?. ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం.. ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో.

పోటీ ప్రపంచంలో పరుగులు పెట్టడం వల్ల సాధారణంగా మనుషులు అనేక రోగాల బారిన పడుతుంటారు. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి, ఇతర కారణాలతో అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే పాములకు కూడా గుండెపోటు వస్తుందా?. ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం.. ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో. అందులో ఓ పాము మెలికలు తిరుగుతూ చనిపోయింది. అయితే పాముకు గుండెపోటు వచ్చిందని అందుకే అలా మృతిచెందినట్లు యువకుడు చెప్పారు. దీంతో ఈ విషయం కాస్త పెద్ద చర్చకు దారితీసింది.


ఈ మధ్య కాలంలో జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ యువత చనిపోతున్న వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఒకప్పుడు పెద్దవయసు వారికే హార్ట్‌ఎటాక్ వచ్చేది. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. అయితే మనుషులతోపాటు జంతువులకు కూడా గుండెపోటు వస్తుందా అనేది ఇంతవరకూ బహుశా ఎవరూ ఆలోచించి ఉండరు. అయితే కర్ణాటక హావేరికి చెందిన ఓ స్నేక్ ప్రేమికుడు తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారడంతో అందరిలోనూ ఈ ప్రశ్నపై ఆసక్తి నెలకొంది.


వీడియోలో ఏముందంటే?

కర్ణాటకలోని హావేరి నగరానికి చెందిన ఓ వ్యక్తి జులై 10న తన ఇన్‌స్టా ఖాతాలో పాముకి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నాగుపాము నేలపై పడి గిలగిల కొట్టుకుంటూ, మెలికలు తిరుగుతూ చాలా సేపటి తర్వాత మృతిచెందింది. అయితే యువకుడితో సహా అక్కడున్న వారంతా పాముకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అందుకే అలా మెలికలు తిరుగుతూ చనిపోయిందని మాట్లాడుకున్నారు. అయితే వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో పలు రకాలుగా స్పందిస్తున్నారు. పాముకు గుండెపోటు రావడం ఏంటని కొందరు, పామును ఏదో వాహనం ఢీకొట్టడం వల్ల చనిపోయిందని మరికొందరూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే సర్పానికి ఏదో వ్యాధి వచ్చిందని మరికొందరు చర్చకు తెరలేపారు. ఈ వీడియోని 4.5మిలియన్ల మంది వీక్షించారు.


దీనిపై పశువైద్యులు ఏం చెప్పారంటే?

మనుషులు, జంతువుల్లాగే పాములకు కూడా గుండె ఉంటుందని పశువైద్యులు చెప్తున్నారు. ఇవి సరీసృపాల వర్గానికి చెందిన కావున వాటికి కూడా హృదయం ఉంటుందని వెల్లడిస్తున్నారు. గుండె ఉందంటే సాధారణంగానే దాని సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. శరీరానికి తగినట్లుగా గుండె రక్తాన్ని పంప్ చేయకపోవడం లేదా ఇతర అనేక రకాల వల్ల వాటికి కూడా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు చెప్తున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 09:37 AM

Advertising
Advertising
<