ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఈ ఐడియా చాలా కాస్ట్లీ గురూ.. వీళ్ల క్రియేటివిటీకి కాళ్లు మొక్కినా తక్కువే..

ABN, Publish Date - Feb 18 , 2024 | 10:20 AM

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కాదేదీ కళకు అనర్హం అని చేసి చూపిస్తున్నారు కొందరు ఔత్సాహికులు. అందరిలా తామూ ఉంటే వెరైటీ ఏముంటుంది అని భావిస్తూ కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు.

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కాదేదీ కళకు అనర్హం అని చేసి చూపిస్తున్నారు కొందరు ఔత్సాహికులు. అందరిలా తామూ ఉంటే వెరైటీ ఏముంటుంది అని భావిస్తూ కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. జీవితంలో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయే కార్యక్రమాలు కొన్నే ఉంటాయి. వాటిని మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిల్చుకోవాలని భావిస్తారు. ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీమంతం గురించి. యువతి మహిళగా మహిళ తల్లిగా మారే శుభ తరుణం అది. ఆ అందమైన క్షణాన్ని పదిలం చేసుకోవాలని భావించిన ఓ యువతి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.

సీమంతం అంటేనే అందమైన వేడుక. రాబోయే బిడ్డకు స్వాగతం చెబుతూ జరుపుకునే అపురూపమైన వేడుక. ఇలాంటి సందర్భాల్లో మహిళలు కొత్త బట్టలు, నగలు ధరిస్తారు. బంగారం, వెండి వెలుగుల్లో జిగేల్ జిగేల్ మని మెరిసిపోవాలనుకుంటున్నారు. కానీ.. వైరల్ వీడియోలోని యువతి మాత్రం డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన నగలను ధరించింది. కాజు, బాదం, కిస్మిస్, పాస్తాలతో చెవిపోగులు, హారం, గాజులు, వడ్డాణం వంటి ఆభరణాలుగా అలంకరించుకుంది.


ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యువతి క్రియేటివిటీకి ఫ్యాన్స్ అవుతున్నారు. ఈ క్లిప్ కు ఇప్పటివరకు 12 మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షల వరకు లైక్‌లు వచ్చాయి. అంతే కాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 10:21 AM

Advertising
Advertising