ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కరెన్సీ నోట్లను ఎదురుగా పెట్టుకుని.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Dec 14 , 2024 | 11:11 AM

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు ఎవరూ చేయని సాహసాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలను నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా..

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు ఎవరూ చేయని సాహసాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలను నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కరెన్సీ నోట్లను ఎదురుగా టేబుల్‌పై పెట్టుకుని చేసిన పని చూసి షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అమెరికన్ (American) తన ఇంట్లో చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇళ్లలో నిప్పుల కుంపటి తరహాలో మంట వెలిగించడం సర్వసాధారణం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి కూడా అలాగే తన ఇంట్లో మంట వెలిగించాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అతను మంట వెలిగించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: వామ్మో.. ఇది నిజమేనా.. సింహాన్ని లాక్కెళ్తున్న డేగ.. షాకవుతున్న నెటిజన్లు..


మంట ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి.. టేబుల్‌పై కరెన్సీ నోట్ల కట్టలను పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని (Man throwing currency notes into fire) మంటల్లో విసిరేస్తున్నాడు. ఇలా టేబుల్‌పై నోట్ల కట్టలన్నింటీని ఒక్కొక్కటిగా మంటల్లో వేస్తున్నాడు. ఇతడు చేసిన ఈ పనికి అంతా అవాక్కవుతున్నారు. ఇతను కరెన్సీ నోట్లతో ఇలా అనేక వినూత్న వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. నోట్ల కట్టలను వరుసగా పేర్చి గోల్ఫ్ ఆడడం, సూట్‌కేస్‌లోని కరెన్సీ నోట్లను బాత్ టబ్‌లో విసిరేయడం వంటి విచిత్ర ప్రయోగాలు చేయడం చూడొచ్చు.

Viral Video: ఓరి దీని వేషాలో.. షాపులోకి దూరిన గేదె.. పట్టుకోవాలని చూడగా.. ఎలా నటించిందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డబ్బులను అలా కాల్చే బదులుగా.. పేదవారికి సాయం చేయొచ్చుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇంతలా విసిరేస్తున్నాడంటే.. అది ఫేక్ మనీ అయి ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆత్మహత్యకు సిద్ధమైన యువతి.. బ్రిడ్జి పైనుంచి దూకుతుండగా.. వెనుక నుంచి ఉన్నట్టుండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 11:11 AM