ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అనంత్ అంబానీ పెళ్లికి ముందు గర్బా నైట్ సెలబ్రేషన్స్

ABN, Publish Date - Jul 05 , 2024 | 08:25 AM

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) పెళ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. జులై 12న రాధిక మర్చంట్(Radhika Merchant), అనంత్ అంబానీల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి వారం ముందు నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

anant ambani Radhika Merchant wedding garba night

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) పెళ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. జులై 12న రాధిక మర్చంట్(Radhika Merchant), అనంత్ అంబానీల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి వారం ముందు నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంబానీ నివాసం యాంటిలియాలో వీటిని జరుపుతుండగా, ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రత్యేక స్నేహితులు హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి గర్బా నైట్, దాండియా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంత్ అంబానీ అమ్మమ్మ కోకిలాబెన్ జరపడే విశేషం. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(viral videos) అవుతున్నాయి.


కాబోయే వధువు రాధికా మర్చంట్(Radhika Merchant) ఈ సందర్భంగా పర్పుల్‌ కలర్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలో స్నేహితులతో పోజులిచ్చింది. దీంతోపాటు వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో హాలు మొత్తం రాధా-కృష్ణుల విగ్రహాలతో అలంకరించబడింది. గుజరాతీ వైబ్‌తో కూడిన ఈ అలంకరణ ఉంది


మరో వీడియోలో వీర్ పహాడియా వేదికపై ప్రదర్శనను చూడవచ్చు. ఆ సమయంలోనే చాలా మంది అతిథులు వేదిక ముందు గార్బా డ్యాన్స్(garba dance) చేస్తూ కనిపిస్తారు. ఈ వీడియోలో, కోకిలాబెన్ అంబానీ దూరంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. గార్బా బీట్‌లో ప్రజలను ఆకర్షించే గాయకుడు పృథ్వీ గోహిల్ కూడా కనిపించారు. పృథ్వీ గోహిల్ గతంలో కూడా అంబానీ కుటుంబానికి చెందిన ఈవెంట్‌లకు హాజరయ్యారు.


పెళ్లికి కొద్ది రోజులే..

సామూహిక కళ్యాణం ముగియగానే అంబానీ కుటుంబం(ambani family)లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బుధవారం 'మామేరు' వేడుకను నిర్వహించగా, మరుసటి రోజు గురువారం గర్బా నైట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ థీమ్‌కు అనుగుణంగా దుస్తులు ధరించి కనిపించారు. అందరూ గుజరాతీ స్టైల్ గాగ్రా-చోలీ, కుర్తా-పైజామా ధరించారు. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి సంబంధించిన అనేక విచిత్రమైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


ఇది కూడా చదవండి:

Viral Video: పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చిన వరుడి ప్రియురాలు.. చివరకు ఆమె అలా చేయడంతో.. అంతా షాక్..

వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్‌


ప్రాణాలు తోడేస్తున్న వాయుకాలుష్యం

Read Viral and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 08:28 AM

Advertising
Advertising