ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అడుగు పెట్టగానే కుంగిపోయిన నేల.. లోపల తొంగిచూడగా దిమ్మతిరిగే సీన్..

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:26 PM

కొన్నిసార్లు కొన్ని సంఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రధానంగా నేలపై తవ్వకాలు జరిపే సమయంలో పురాతన వస్తువులు బయటపడడం అప్పడుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా...

కొన్నిసార్లు కొన్ని సంఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ప్రధానంగా నేలపై తవ్వకాలు జరిపే సమయంలో పురాతన వస్తువులు బయటపడడం అప్పడుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఓ ప్రాంతంలో అడుగు పెట్టగానే భూమి కుంగిపోయింది. దీంతో అనుమానం వచ్చి అందులోకి తొంగిచూడగా.. లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘వామ్మో.. ఇదేంటీ మరి విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఈ ఘటన న్యూయార్క్‌లో (New York) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఉన్నట్టుండి భూమి కుంగిపోయి రంధ్రం ఏర్పడింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందులో ఏముందా అని తెలుసుకునేందుకు లోపలికి తొంగి చూశాడు.

Viral Video: కుక్కను నీటిలోకి విసరబోయిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


లోపలికి చూడగా సొరంగం (underground tunnel) ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో అందులోకి కెమెరా పంపించాడు. దీంతో లోపల పైప్ లైన్‌ తరహాలో నిర్మాణం కనిపించింది. అందులోకి వెళ్లి చూడగా లోపల కళ్లు జిగేల్‌మనే దృశ్యం కనిపిస్తుంది. ఓ పెద్ద హాల్ కనిసిస్తుంది. అందులో చాలా మంది కూర్చుని వేడుకలు తిలికేందుకు వీలుగా నిర్మించారు. అలాగే ఈ హాలు పక్కన అనే గదులు కూడా కనిపించాయి.

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..


ఆ గదుల మధ్యలో వైర్, పైప్ కనెక్షన్ కూడా చూడొచ్చు. ఈ రహస్య గదులను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘న్యూయార్క్‌లో సొరంగాలు బయటపడ్డాయంటే నమ్మలేకున్నాం.. అంటే ఈ నగరం మొత్తం సొరంగాల పైన నిర్మించారా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే.. ఇది యూదుల సొరంగంలా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..

Updated Date - Aug 16 , 2024 | 04:26 PM

Advertising
Advertising
<