ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..

ABN, Publish Date - May 10 , 2024 | 07:34 PM

ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు ప్రబుద్ధులు.. వయసు, వరసా మరచి ప్రవర్తిస్తుంటారు. మరికొందరు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాసికానందాన్ని పొందుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా...

ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు ప్రబుద్ధులు.. వయసు, వరసా మరచి ప్రవర్తిస్తుంటారు. మరికొందరు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాసికానందాన్ని పొందుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ తన వాహనాన్ని నిర్మానుష్య ప్రదేశంలో ఆపేశాడు. చివరకు అతడు ప్రవర్తించిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్‌లోని ఓంకార్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ఓ వ్యక్తి ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలో విద్యార్థులను స్కూల్లో వదలడం, తిరిగి ఇంటికి తీసుకురావడం కూడా చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు అతడి ఆటోలో పదో తరగతి చదవుతున్న బాలిక ఒక్కటే ఎక్కింది. ఆమెను ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అతడి బుద్ధి పక్కదారి పట్టింది. దారి మధ్యలో నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను నిలిపేశాడు.

Viral Video: ఈ పిచ్చుక మంచి మనసుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..


డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగి వెనుక సీటు వద్దకు వెళ్లి నిల్చున్నాడు. బాలికతో మాట మాట కలుపుతూ, ఆమెపై చేతులు వేసి (Auto driver misbehaved with girl) తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ ఘటనతో బాలిక ఉలిక్కిపడింది. ‘‘వద్దు.. వద్దు.. నన్ను వదిలేయ్’’.. అంటూ భయంతో కేకలు వేయడంతో ఎవరైనా చూస్తారేమో అని భయపడ్డ అతను.. డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. తర్వాత బాలికను సముదాయించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ ఆమె అదే షాక్‌లోనే ఉంది. తర్వాత ఆమెను బలవంతంగా లాగి ముద్దు కూడా పెట్టాడు. తర్వాత చాలాసేపటికి ఆటోను స్టార్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు.

Viral Video: పర్‌ఫెక్ట్ ట్రైనింగ్.. రోడ్డుపై ఈ ఎలుగుబంటి చేస్తున్న పని చూడండి..


ఈ ఘటన మొత్తం దూరంగా ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. చివరకు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో సదరు వ్యక్తి బాలికను రెండేళ్లుగా ఆటోలో తీసుకెళ్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘వీడియో తీస్తున్న వారు వెళ్లి అతడికి బుద్ధి చెప్పొచ్చుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: దారికి అడ్డుగా పడుకున్న ఎలిగేటర్లను.. ఈ సైక్లిస్టు ఎలా దాటుకెళ్లాడో చూస్తే..

Updated Date - May 10 , 2024 | 07:34 PM

Advertising
Advertising